Breaking: గన్నవరం లో భారీ అగ్నిప్రమాదం..!!

Share

Breaking: ఈరోజు తెల్లవారుజామున కృష్ణా జిల్లా గన్నవరం లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విజయ పాలిమర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అతి తక్కువ సమయంలోనే ఫ్యాక్టరీ మొత్తం.. మంటలు వ్యాపించాయి. ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ కంపెనీ చుట్టుప్రక్కల ప్రజలు మరియు స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుండి పరుగులు తీశారు.

Vijayawada Fire Accident: కృష్ణాజిల్లా గన్నవరంలో భారీ అగ్నిప్రమాదం..  కాలిబూడిదైన విజయ పారిమిల్స్‌ | Vijayawada: fire accident in vijaya polymers  gannavaram | TV9 Telugu

ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో.. స్థానికులు భయాందోళన చెందారు. ఇదే క్రమంలో ఈ కంపెనీ పక్కనే పలు పరిశ్రమలు ఉండటంతో.. మరింత ప్రమాదం సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానికులు మరియు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి భారీగా కష్టపడ్డారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలను గురించి ఆరా తీస్తున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ కాకపోయినా గానీ ఆస్తినష్టం భారీగానే వాటిల్లినట్లు సమాచారం.


Share

Related posts

Big Boss: నలుగురు ప్రాణాలను కాపాడిన బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్..!!

sekhar

గ్రామ, వార్డు సచివాలయల పై జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే….

arun kanna

T Congress: టీ కాంగ్రెస్ లో నయా ట్రెండ్ ..! మార్పునకు ఇది సంకేతం..?

somaraju sharma