బీజేపీ నాయకులపై టెర్రరిస్టుల పంజా..! ముగ్గురు మృతి

 

 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు పైన కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన కాల్పులలో స్థానిక యువజన వింగ్ నాయకుడితో సహా ముగ్గురు బిజెపి కార్యకర్తలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుల్గామ్ జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో కార్ లో ప్రయాణిస్తన్న వారిపైన తుపాకులతో ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారు అయ్యారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు క్రైమ్ స్పాట్ వద్దకు చేరుకొని, తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో పోలీసులు ఆ ప్రాంతాన్నంతటినీ తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా దళాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కుల్గామ్ పోలీసులు ఇచ్చిన దర్యాప్తు నివేదిక ప్రకారం మృతి చెందింది, వైకె పోరా నివాసి గులాం అహ్మద్ యాటూ కుమారుడు బీజేపీ కార్యకర్త ఫిదా హుస్సేన్ యతూ బీజేవైఎం జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి, ఉమర్ రషీద్ బేగ్ కుల్గం బీజేవైఎం జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, మరియు వైకె పోరా నివాసి బిజెపి కార్యకర్త అయిన మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్ హజామ్ బీజేవైఎం జనరల్ సెక్రటరీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

గత కొన్ని నెలలుగా ఉగ్రవాద దాడుల్లో పలువురు బిజెపి కార్యకర్తలు మరణించారు,జూలైలో బిజెపి నాయకుడు షేక్ వసీం, అతని తండ్రి మరియు సోదరుడు బండిపోరాలో ఉగ్రవాదుల చేత చంపబడ్డారు. ఒక నెల తరువాత, కుల్గాంలో ఒక బిజెపి సర్పంచ్ కాల్చి చంపబడ్డాడు.

 

భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఫై జర్గుతున్న ఉగ్రవాదుల దాడిని పీఎం మోడీ తీవ్రంగా ఖండించారు, మృతి చెందిన ముగ్గురు కార్యకర్తల కుటుంబానికి కి అండగా ఉంటాను అని తెలుపుతూ, ట్విట్టర్ లో నివాళులు అర్పించారు.