Thaman : ఎస్ ఎస్ థమన్..ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లో మోత మరీ విసిగించేలా ఉందని కామెంట్స్ వచ్చాయి. డప్పుల శబ్ధం తప్ప వినసొంపైన మ్యూజిక్ థమన్ ఇవ్వడం లేదని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినా థమన్ దూకుడు, దరువు, ఆగడు..ఇలా అన్నిసినిమాలకి ఒకే రకమైన డప్పుల వాయింపుడు వినిపించాడు. దాంతో కాస్త ఇండస్ట్రీ వర్గాలు థమన్ కి సినిమా ఇవ్వాలంటే ఆలోచించారు. ఆ సమయంలో రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ దుమ్ము దులిపేశాడు. అయితే గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది.
సినిమా సక్సెస్ కి థమన్ ప్రధాన కారణమయ్యాడు. దాంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడమే కాదు వరుసగా సినిమాలు అందుకున్నాడు. ఇక వకీల్ సాబ్ సినిమాతో థమన్ క్రేజ్ అండ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. వకీల్ సాబ్ సాంగ్స్..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ చాలా హైలెట్ అయ్యాయి. దాంతో మెగా హీరోల సినిమాలకి థమన్ కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న లూసీఫర్, పవన్ కళ్యాణ్ ఏకే తెలుగు రీమేక్ సినిమాకు, వరుణ్ తేజ్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదే క్రమంలో థమన్ శంకర్ – చరణ్ సినిమాకి సంగీత దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు.
Thaman : హిందీ సినిమాలకి డేట్స్ ఇవ్వలేక ప్రస్తుతం నో అని చెప్పాడట.
ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటతో పాటు మరికొన్ని సినిమాలకి సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు 2021 చివరి వరకు మరికొన్ని భారీ సినిమాలను దక్కించుకుంటాడని అంటున్నారు. కాగా ఇటీవల థమన్ కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయట. కానీ నో చెప్పినట్టు తెలుస్తోంది. థమన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు. అందుకే హిందీ సినిమాలకి డేట్స్ ఇవ్వలేక ప్రస్తుతం నో అని చెప్పాడట. అయితే వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా బాలీవుడ్లో ఎంటరవడం ఖాయమని సమాచారం.