Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని దిల్ రాజు – బోనీ కపూర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై మంచి హైప్ తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ట్రైలర్ కంటే ముందుగానే ‘మగువా.. మగువా..’ అనే సాంగ్ లాక్ డౌన్ సమయంలో థమన్ రిలీజ్ చేసి.. పవన్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించాడు.
ఈ సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలావుంటే ఇటీవల థమన్ సోషల్ మీడియాలో ఫిబ్రవరి 14 వ తారీఖు ఒక లవ్ సింబల్ షేర్ చేసి డిఫరెంట్ పోస్ట్ పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రేమికుల దినోత్సవం నాడు థమన్… ‘వకీల్ సాబ్’ సినిమాలో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయటానికి రెడీ అయ్యారని భావించారు. పవన్- శృతి హాసన్ మధ్య సాగే రొమాంటిక్ పాట ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుందని.. పవన్ అభిమానులు సోషల్ మీడియా లో సాంగ్ నీ ట్రెండ్ చేయడం కోసం ఎవరికి వారు లెక్కలు వేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో హడావిడి ఎక్కువవడంతో థమన్ పవన్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఫిబ్రవరి 14న ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన ఎలాంటి సాంగ్ కూడా రావడం లేదని పోస్టు ద్వారా తెలియజేశాడు.
ప్రస్తుతం “వకీల్ సాబ్” పాటలను కంప్లీట్ చేసే పనిలోనే తాను బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. పవన్ సినిమా కోసం చాలా బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం కోసం.. టీం మొత్తం బాగా కష్ట పడుతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో థమన్ పోస్ట్ దెబ్బకి పవన్ అభిమానులు ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ సాంగ్ నీ ట్రెండ్ చేయాలని.. సోషల్ మీడియాలో మరో రికార్డు పవన్ పేరిట ప్రేమికుల దినోత్సవం నాడు క్రియేట్ చేయాలని భావించగా.. సాంగ్ రిలీజ్ అవ్వడం లేదని థమన్ తెలపటంతో అభిమానులు నిరాశ చెందారు.