NewsOrbit
న్యూస్

అధికారుల ఆనందానికి కారణం అదేనట!

టిడిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే అధికారులు హడలెత్తి పోయేవారు.సిఎం టూర్ కిచేయాల్సిన ఏర్పాట్లపైనే వారి దృష్టంతా ఉండేది!

That is the reason for the happiness of the officers
That is the reason for the happiness of the officers

ముఖ్యమంత్రి వచ్చే వెళ్ళి పోయేంతవరకు అధికారులు ఇంక ఏ పని చేసేవారు కాదు! అది చంద్రబాబు నాయుడు జమానా! కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఇప్పుడు అధికారులకు ఏ టెన్షన్ లేదు! గోదావ‌రి ముంపు ప్రాంతాన్ని ప‌రిశీలించ‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమవారం ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. ఆయ‌న వెంట హోం మంత్రి సుచ‌రిత‌, మ‌రో మంత్రి పేర్ని నాని మాత్రమే ఉన్నారు. అధికారులెవరూ జ‌గ‌న్ వెంట లేరు.జగన్ కేవలం ఏరియల్ సర్వేకే పరిమితమయ్యారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెలికాఫ్టర్ నుండి అంతా చూసి వెనక్కు వచ్చేశారు తప్పితే ఆ ప్రాంతంలో దిగి అధికారుల‌తో సమీక్షాస‌మావేశం నిర్వ‌హించ‌లేదు.సీఎం పని సీఎం చూసుకున్నారు అధికారులు తమ పని తాము చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో వారు నిమ‌గ్న‌మయారు.వారికి సీఎం టూర్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్సు కలుగలేదు! దీంతో అధికారులు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన టూర్ కి వస్తే తాము ఎలాంటి ఇబ్బందులు పడే వారు గుర్తు చేసుకుంటున్నారు.ఇది నిజమే.మీడియాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి .


చంద్ర‌బాబు నాయుడు ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హి౦చాక విప‌త్తు చోటు చేసుకున్న చోట‌కు కొన్ని కిలోమీట‌ర్ల ఆవ‌ల మ‌కాం పెట్టే వారు. అక్క‌డ‌కు అధికారులంతా రావాల్సిందే! జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఇత‌ర ముఖ్య అధికారులు ముఖ్య‌మంత్రి తో ఉండాల్సి౦దే. ఇక చంద్రబాబు సమీక్ష సమయంలో అధికారులపై ఫైర్ కావడం ,అది ఎల్లో మీడియాలో ప్రొజెక్టు కావడం ఇంకో తంతు.మొత్తం మీద కావాల్సిన ప్రచారమంతా వచ్చాక గానీ చంద్రబాబు అక్కడ నుండి కదలి వెళ్లేవారు కాదు.అప్పటివరకు అధికారులంతా అక్కడే బందీలుగా ఉండిపోయేవారు.

కీలక సమయంలో అధికారులు లేకపోవటం వల్ల ప్రజలుఇబ్బంది పడే వారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి ప్రాధాన్యమిచ్చేవారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జగన్ కేవలం తను ఒక్కడే ఏరియల్సర్వే నిర్వహించి వెళ్లి పోయారు. దీంతో అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.పర్యటనకు బయల్దేరే ముందే అధికారులు తన కార్యక్రమానికి రానక్కర్లేదు అని పునరావాస చర్యలను కొనసాగించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు కూడా సమాచారం.ఒక అధికారి దీన్ని విశ్లేషిస్తూ చంద్రబాబుకు ప్రచారం ముఖ్యం.. ప్రస్తుత సీఎం జగన్ కి ప్రజలు ముఖ్యం అని తేల్చేశారు.ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదు!

author avatar
Yandamuri

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk