NewsOrbit
న్యూస్

Viral News: అందుకోసం ఈ పాస్ అడిగాడు..! పోలీసులకు వెరైటీ సాకు చెప్పిన కేరళ కుర్రోడు..!

Viral News: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో చాలా వ‌ర‌కు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్లాలంటే.. పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకోసం ఈ-పాస్ పొందాల్సిందే. అత్యవసరమైన పని ఉంటే ఈ-పాస్ కు అప్లయ్ కు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో కేరళలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

that is why he asked for this pass
that is why he asked for this pass

Viral News: అతనికి ఈ పాస్ ఎందుకంటేనంట?

కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తి ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్ర‌మైన అభ్య‌ర్థ‌న చేశాడు. శృంగార కోసం బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్య‌క్తి పోలీసుల్ని కోరాడు. క‌న్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో పోలీసులు కంగుతిన్నారు. వీడెవడండి బాబూ అని తల పట్టుకున్నారు. ఆ తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అప్లికేష‌న్ పెట్టిన ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు.వాలాప‌ట్ట‌ణం పోలీసులు అత‌న్ని ఈ పాస్ లోఉన్న చిరునామా ప్రకారం వెతికి ప‌ట్టుకున్నారు.తమదైన శైలిలో విచారణ సాగించారు

సిక్స్ రాయబోయి సెక్స్ అని రాశానన్న కిలాడీ!

ఎందుకిలా చేశావ్ అంటే, ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. ఆ తర్వాత అక్ష‌ర దోషం వ‌ల్ల త‌న అప్లికేష‌న్‌లో పొర‌పాటు జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి వివరణ ఇచ్చాడు. పోలీసుల‌కు క్ష‌మాప‌ణ కూడా చెప్పాడు. ఇంగ్లీషులో ‘six o clock’ అని రాయాల‌ని అనుకున్నాన‌ని, కానీ త‌న ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున‌ ‘sex’ అని ప‌డిన‌ట్లు తెలిపాడు. ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించిన పోలీసులు.. ఇంకెప్పుడూ అన‌వ‌స‌ర కార‌ణాల‌తో ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి అత‌డిని వదిలేశారు. బీహార్‌లోనూ ఓ వ్య‌క్తి కూడా చిత్ర‌మైన కార‌ణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాల‌ని కోరాడు. మొటిమ‌ల చికిత్స కోసం వెళ్లేందుకు త‌న‌కు పాస్ ఇవ్వాల‌ని అత‌ను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు.ఈ పాస్ కోసం ఆషామాషీ కారణాలు చూపితే కృష్ణ జన్మస్థానం లో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.తస్మాత్ జాగ్రత్త!

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!