NewsOrbit
న్యూస్

జగన్ బాబు అమిత్ షా ను కలిసింది అందుకా?

సడన్ గా సీఎం జగన్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం.. అమిత్‌షా అపాయింట్‌మెంట్ సంపాదించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది రాష్ట్ర అభివృద్ధి నిధులు కోస‌మే అని వార్తలు వచ్చినా..

That is why Jagan Babu met Amit Shah
That is why Jagan Babu met Amit Shah

సీబీఐ ఏపీలో దూకుడు పెంచ‌డం, సిఎం బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసును ఛేధిస్తుండడం.., ఆయ‌న అనుచ‌రుల్ని, రైట్ హ్యాండ్‌ను అదుపులోకి తీసుకోవ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ మామ గంగిరెడ్డిని విచార‌ణ‌కి పిలిచే అవ‌కాశం ఉండ‌టంతో కేంద్రాన్ని శాంతింప‌జేసే ల‌క్ష్యంతోనే జగన్‌ ఢిల్లీ టూర్ సాగింద‌ని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఆయన హత్య వెనుక ఎవరున్నారో కూడా సిబిఐ కనిపెట్టేసి౦దంటున్నారు! ఇదే జగన్ క్యాంపు లో అలజడి పెంచిందని సమాచారం.అందుకే.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారంతా ఇప్పుడు ఢిల్లీ బాట పడుతున్నారట.సీబీఐ విచార‌ణలో ఈ హత్య కేసులో అంతా వైఎస్ ఇంటి మ‌నుషులే సూత్రధారులు, పాత్రధారులుగా తెర‌మీద‌కొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

జ‌గ‌న్‌రెడ్డి బాబాయ్ భాస్కర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వీరి రైట్ హ్యాండ్ దొండ్లవాగు శంక‌ర్‌రెడ్డి, స్నేహితుడు ఉద‌య్‌కుమార్‌‌రెడ్డిలంతా వైఎస్ ఇంటి మ‌నుషులే.వారి చుట్టే ఈ విచారణ సాగుతోంది. హ‌త్య జ‌రిగిన‌ప్పుడు ముందుగా తెలిసిన వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి. అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకొని విచారించింది. ఉద‌య్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో త‌న ద‌గ్గర ఉన్న గుట్టు మొత్తం కక్కేశాడని ప్రచారం జరుగుతోంది.అలాగే హైద‌రాబాద్‌లో దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని మొత్తం గుట్టు లాగేసి౦దని విశ్వస‌నీయ స‌మాచారం.పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించింది.  మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు. ఈ డబ్బు ఎక్కడిద‌నేదానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ కోణంలో నుంచి విచారణ జరిపినా అది వైఎస్ కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతూ ఉండటం ఇక్కడ గమనార్హం. ఇదేదో మెడకు చుట్టుకుంటుంది అన్న భావనతోనే జగన్ నేరుగా హోంమంత్రి అమిత్షా దాకా వెళ్లి వచ్చాడని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!