తాప్సీ పన్ను ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సొట్ట బుగ్గల సుందరి తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె సినిమాల గురించి కాకుండా శృంగార జీవితం గురించి చేసిన కొన్ని కామెంట్స్ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. తాప్సీ హీరోయిన్గా నటించిన ‘దొబారా’ సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవ్వబోతుంది.
కరణ్ జోహార్ పరువు తీసిన తాప్సీ
ఈ మధ్య బాలీవుడ్ లో వచ్చే సినిమాలకు సంబంధించిన హీరో హీరోయిన్లు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంటున్నారు. కానీ తాప్సీ మాత్రం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆ షోకి హాజరు కాలేదు. ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ఒక మీడియా తాప్సీ పన్నుని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు తాప్సీ కరణ్ జోహార్ గురించి కాస్త వెటకారంగా సమాధానం చెప్పింది. అసలు ఆమె ఏం చెప్పిందంటే “కాఫీ విత్ కరణ్” షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు” అని ఘాటుగా తాప్సీ తన స్టైల్లో సమాధానం చెప్పింది.
కరణ్ కి తలెత్తుకోలేని షాక్
తాప్సీ అలా మాట్లాడడానికి కారణం ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చిన సెలబ్రిటీలందరినీ వారి శృంగార జీవితం గురించి ఓపెన్‌గా ప్రశ్నించడం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, అమీర్ ఖాన్, కరీనాకపూర్ లాంటి స్టార్స్ ఈ షోలో కరణ్ అడిగిన శృంగార జీవితానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నపై కొందరు విమర్శలు వెల్లడించారు. ఆ లిస్టులో ఇప్పుడు తాప్సీ కూడా చేరింది. కరణ్ జోహార్ అడిగే సెక్స్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేక తాప్సీ ఇలా వ్యంగ్యంగా స్పందించింది. అనురాగ్ కష్యాప్ దర్శకత్వం వహించిన దొబారా సినిమా స్పానిష్ చిత్రం మీరాజ్కి రీమేక్‌గా రూపొందించారు. ఇప్పటికే లండన్, ఫాంటాసియా ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.