NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Etela Rajendar: ఆ నివేదిక చెల్లదు.. ఈటెల వ్యహహారంలో హైకోర్టు ఇచ్చిన మలుపుతో కేసీఆర్ కి షాక్..!!

Etela Rajendar:  మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌‌‌‌కు లెటర్, ఆ వెంటనే కలెక్టర్‌‌‌‌కు విచారణ ఆదేశాలు క్షణాల్లో జరిగిపోవడం ఒక ఎత్తయితే.. 24 గంటల్లోనే ఎంక్వైరీ చేసేసి, రిపోర్ట్ సీఎంకు అందించడం అతి పెద్ద ట్విస్ట్.

That report is not valid .. Shock to KCR with the turn given by the High Court in Etela Rajendar Case .. !!
That report is not valid Shock to KCR with the turn given by the High Court in Etela Rajendar Case

ఈటల కబ్జాకోరు అనడానికి ఆ రిపోర్టునే ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ఆయనను కేబినెట్‌‌ నుంచి బర్తరఫ్ చేసింది. కానీ మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణలో అసలు కలెక్టర్ ఇచ్చిన ఆ ‘హైస్పీడ్ రిపోర్ట్’ చెల్లదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఆ రిపోర్టును అడ్డంపెట్టుకుని ఈటలను బర్తరఫ్ చేయడం ఎలా చెల్లుతుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటలను తప్పించడం వెనుక భూ కబ్జా కారణం కాదని, రాజకీయ విబేధాలు, కక్షలతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలియట్లేదా అన్న మాటలు కొందరు నేతల్లో వినిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఈటలపై వేటుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, సరైన టైమ్‌‌ కోసం ఎదురుచూసి కరెక్ట్‌‌గా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే స్కెచ్ అమలు చేశారని టీఆర్ఎస్ వర్గాల్లోనే డిస్కషన్ జరుగుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వినిపిస్తున్న ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు భూ కబ్జాలనే సరైన సాకుగా కేసీఆర్ భావించి, కరోనా టైమ్‌‌లో హుటాహుటిన రిపోర్ట్ తెప్పించారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

చట్టాలను పక్కన పెట్టేశారు

ఏ ల్యాండ్ డిస్ప్యూట్​లోనైనా రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించేటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు వారం ముందే కచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. రెవెన్యూ శాఖలో అమలులో ఉన్న పీఓటీ, సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టాలు ఇదే చెబుతున్నాయి. కానీ జమున హ్యాచరిస్ విషయంలో రెవెన్యూ అధికారులు ఇవేం పాటించలేదు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్​కు సంబంధించి ఇలాంటి సమస్యలే అనేకం ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్లందరి సమస్యను పరిష్కరించవచ్చు. ఈటల రాజేందర్ బర్తరఫ్ విషయానికొస్తే.. అది సీఎం విచక్షణాధికారానికి సంబంధించినది. ఆయనను తొలగించాలనుకుంటే సీఎం ఎలాగైనా తొలగించవచ్చు. కానీ ఒక కాజ్ కోసం చూసినట్లు కనిపిస్తోంది.

ఈటలకు అండగాఅనుచరులు

ఈటలకు అండగా తామున్నామంటూ అనుచరులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం శామీర్ పేట నుంచి అనుచరులతో ఈటల హుజురాబాద్ లోని క్యాంపు ఆఫీస్​కు వచ్చారు. రాత్రి నుంచే ఈటల రాజేందర్ క్యాంపు ఆఫీస్​దగ్గర‍ అభిమానుల హడావుడి మొదలైంది. శామీర్ పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ నియోజకవర్గ ప్రజల మెజార్టీ అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడారు. ఆయనను కలిసినవారిలో ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంట నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. మచ్చలేని నాయకుడిని ఇలా అన్యాయంగా ఇరికించి బదనామ్ చేశారని, అయినా ఇంకా పార్టీలో ఉండి ఏంలాభం, . ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బయటకు రావాలని కొందరు చెప్పారు. బయటకు వచ్చి బై ఎలక్షన్లలో పోటీ చేసి సత్తా చాటాలని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఏమైనా కేసీఆర్ సొత్తా.. పార్టీకి ఎంతో సేవ చేసినవ్.. రాజీనామా చేయొద్దు.. ఇట్లనే ఉండి కొట్లాడాలే అని ఇంకొక వర్గంవారు అన్నారు. ఈటల వారు చెప్పిందల్లా విన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. మంగళవారం ఉదయాన్నే ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటికి పంపించారని చెప్పుకొచ్చారు. ఈటలకి వారంతా మద్దతుగా నిలిచారు. ఒకటి రెండు రోజుల్లో ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

తెగ‌‌దెంపులు చేసుకోవాలె: టీఆర్ఎస్‌‌లోని ఈటల అనుచరులకు పార్టీ పెద్దల ఫోన్లు
టీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులకు పార్టీ పెద్దలు ఎర వేస్తున్నారు. వారికి ఫోన్ చేసి ఈటలతో రాజకీయ బంధాలను తెంచుకోవాలని చెప్తున్నారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి పెద్దఎత్తున లీడర్లు, కార్యకర్తలు శామీర్‌‌పేటకు తరలివచ్చారు. ఆయన నియోజకవర్గానికి వెళ్తుంటే భారీ స్థాయిలో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. దీంతో నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పట్నుంచి ఈటల వెంట ఉండొద్దని వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju