NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ సింగిల్ ఎమ్మెల్యే చీటి చించేసిన జ‌గ‌న్‌.. తెలివిగా ప‌క్క‌న పెట్టేశారే…!

ఏపీలో 2019 ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయిన కూడా రాష్ట్ర మొత్తం మీద రాజోలులో గెలిచిన రాపాక వరప్రసాదరావు జనసేన ఏకైక ఎమ్మెల్యేగాను, అలాగే జనసేన తొలి ఎమ్మెల్యేగా రికార్డులు నిలిచిపోయారు. రాపాక వరప్రసాద్ రావు 2009లో రాజోలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కేవలం 300 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. సొంతంగా పోటీ చేస్తే రాపాక బలం 300 ఓట్లు మాత్రమే.

2019 ఎన్నికలలో రాపాక వాస్తవానికి వైసీపీ సీటు ఆశించారు. జగన్ ఆ సీటును 2014 ఎన్నికలలో ఓడిన బొంతు రాజేశ్వరరావుకు కేటాయించారు. దీంతో రాపాకును రాజోలు నియోజకవర్గంలోనూ కొందరు క్షత్రియ సామాజిక వర్గం నేతలు వెంటబెట్టుకుని పవన్ దగ్గరకు తీసుకువెళ్లి జనసేన టికెట్ ఇప్పించారు. ట్రయాంగిల్ ఫైట్లో రాపాక కేవలం 700 వాట్ల స్వల్ప తేడాతో గట్టి ఎక్కారు. ఎమ్మెల్యేగా గెలిచిన యాడాదిన్నర కాలానికి రాపాక పవన్ కు దూరం జరగటం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత పవన్ పై విమర్శలు మొదలుపెట్టి చివరకు జనసేన కండువా తీసి వైసిపి చెంత చేరిపోయారు. తన కుమారుడికి వైసిపి కండువా కప్పించారు. విచిత్రం ఏంటంటే రాపాక వైసిపికి దగ్గరైనా కూడా రాజోలు పగ్గాలు జగన్ ఆయనకు అప్పగించలేదు. బొంతు రాజేశ్వరరావును తప్పించి పెడ‌పాటి అమ్మాజీని ఆస్థానంలో తీసుకువచ్చారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి రాజోలులో టిడిపి టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి రావడంతో జగన్ సూర్యారావుకు రాజోలు సీటు కేటాయించి.. రాపాకను రాజోలు నుంచి తప్పించేశారు. అయితే రాపాక వరప్రసాద‌ రావుకు అమలాపురం ఎంపీ సీటు ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. దీనిపై రాపాకకు ఎంత మాత్రం నమ్మకం లేదు.

వైసీపీలో సీటు రాని దళిత ప్ర‌జాప్రతినిధులందరికీ జగన్ అమలాపురం ఎంపీ సీటు ఎరగా వేస్తున్నారు. ఇప్పటికే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మరో ఒకరిద్దరూ దళిత ఎమ్మెల్యేలకు కూడా అమలాపురం సీటు ఇస్తామంటూ మభ్యపెడుతున్నట్టు సమాచారం. రాపాకకు సీన్ అర్థమైంది. తనకు అమలాపురం సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. ముందుగా జగన్ ఏం చెబితే అదే చేస్తానంటూ వచ్చినా రాపాక ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు.

తనకు రాజోలు సీటు మాత్రమే కావాలని సర్వే చేయించి మరి తనకు జగన్ రాజోలు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని.. ఓడిపోయే వాళ్లకు ఇవ్వటం కుదరదు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీనికి తోడు రాజులలో రాపాక వర్గీయులు కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు ప్రారంభించారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాపాకను చాలా తెలివిగా జనసేన నుంచి దూరం చేసి ఇప్పుడు అవసరం తీరాక సీటు ఇవ్వకుండా పక్కన పెడుతున్న వాతావరణమే కనిపిస్తోంది.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N