ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ లో చరణ్ – ఎన్.టి.ఆర్ పాల్గొంటున్నారు. దర్శక ధీరుడు ss rajamouli తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అల్లూరి సీతారామరాజు – కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న ram charan – ntr ల మీద క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారని తాజా సమాచారం. కాగా ఆర్ ఆర్ ఆర్ దేశభక్తి ప్రధానంగా ఇద్దరు పోరాట యోధుల కథ ని ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి రూపొందిస్తున్నారు.
యూనివర్సల్ కథాంశం పైగా పోరాట యోధుల కథని వెండితెర మీద ఆవిష్కరిస్తున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా RRR మీద ఊహకందనంతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక దర్శకుడిగా మారినప్పటి నుంచి rajamouli అపజయం అంటే ఏంటో తెలియదు. సినిమా సినిమాకి తన సత్తా చాటుతూ పాన్ ఇండియన్ స్థాయిలో గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ ని నభూతో న భవిష్యత్ అన్నట్టుగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తయారు చేస్తున్నారు. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్ఠించిన రాజమౌళి ఇప్పుడు RRR తో మరో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నాడు.
కాగా రాజమౌళి తాజాగా ఒక ఫొటో ని రిలీజ్ చేశారు. ram charan – ntr చేతులు పట్టుకున్న ఆ ఫొటో క్లైంకాస్ సీన్ లోనిది అని తెలిసింది. ఇప్పుడు ఆ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ సాగుతుండగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఎన్.టి.ఆర్- రామ్ చరణ్ గగుర్పొడిచే విన్యాసాల్ని ప్రదర్శిస్తారని సమాచారం. పతాక సన్నివేశాల్లో దేశభక్తి తో వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కి స్వయంగా rajamouli యాక్షన్ కొరియేగ్రఫీ చేస్తున్నారట. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ ను నిర్మిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!