ట్రెండింగ్ న్యూస్

త్రివిక్రమ్ రికమండేషన్ తో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్..??

Share

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియం’ తెలుగులో పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రానా కూడా సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు. ఇదిలా ఉంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు నటించడానికి సముద్రఖని రెడీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Samuthirakani Photos [HD]: Latest Images, Pictures, Stills of Samuthirakani  - FilmiBeatతనని సినిమాలో త్రివిక్రమ్ పెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తుంది అన్నది ఇంత వరకు స్పష్టత రాలేదని సముద్రఖని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సముద్రఖని తెలుగులో రాజమౌళి చేస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా కూడా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అలా వైకుంఠపురం లో” సముద్రఖని విలన్ గా చేయడం అందరికీ తెలిసిందే.

 

ఆ సినిమాలో ఉన్నది కొంతసేపు అయినాగానీ .. విలన్ తరహా లో అదరగొట్టే రీతిలో నటించారు. దీంతో ఇదే చనువుతో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ నటించబోయే ‘అయ్యప్పన్ కోషియం’ సినిమా లో పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం వర్గాల లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రావటం జరిగాయి. దీంతో ఇంకో సినిమా కన్ఫామ్ అయితే గనుక వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా వచ్చినట్టే. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు.


Share

Related posts

Etela Rajender: బీజేపీలో చేరుడు ఖాయమే.. డౌట్‌లు క్లారిఫై చేసుకున్న ఈటల..!!

somaraju sharma

Corona Vaccine: ఫ్రీగా బిర్యాని పొందండిలా..!! షరతులు వర్తిస్తాయి..!!

bharani jella

టాలీవుడ్ హీరోలను ఆదుకుంటున్న పోలీస్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar