వరుసగా మెగా హీరోలను లైన్ లో పెడుతున్న ఆ టాప్ డైరెక్టర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పరాజయం లేని డైరెక్టర్లలో ఒకరు కొరటాల శివ. ఇప్పటిదాకా శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించి భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది స్టార్టింగ్ లో ప్రారంభం కాగా.. కరోనా వైరస్ రాకతో మొన్నటి వరకు షూటింగ్ ఆగిపోయింది.

Koratala Siva - Wikipediaఅయితే ఇటీవల మళ్లీ ప్రారంభం అయింది. దాదాపు “భరత్ అనే నేను” సినిమా తర్వాత కొరటాల… చిరంజీవి ఆచార్య సినిమా ప్రకటించి కూడా… ఏడాది కాలం పాటు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్ దాదాపు ఏడు నెలల గ్యాప్ రావడంతో… మెగా కాంపౌండ్ లోనే మెగా హీరోలను వరుసగా లైన్ లో పెడుతున్నారని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా లాక్ డౌన్  సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాని ఓకే చేయడం మనకు తెలిసిందే.

 

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తో కూడా సినిమాని కొరటాల ఓకే చేయించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కాగా ముందు బన్నీ తో చేసిన తర్వాత అప్పుడు రామ్ చరణ్ తో  ప్రాజెక్టు మొదలు పెట్టాలని కొరటాల అనుకుంటున్నట్లు … దానికి సంబంధించిన వార్త త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి తో చేస్తున్న “ఆచార్య” సినిమాలో కూడా… రామ్ చరణ్ క్యారెక్టర్ అరగంట పాటు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో… చిరంజీవి లేని సన్నివేశాలను కంప్లీట్ చేస్తున్నారట డైరెక్టర్ కొరటాల.