NewsOrbit
Featured న్యూస్

ఆ వైసిపి మహిళా ఎమ్మెల్యేకు ప్రాణరక్షణ కావాలట! గుంటూరు జిల్లాలో మరో రచ్చ

question on ysrcp in kaun banega crorepati program

తనకు ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందంటూ తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ లు ఫోన్లో గొంతు మార్చి తానే మాట్లాడుతున్నట్లు అందర్నీ భ్రమింప చేస్తున్నారని ,వారు తనను వెంటాడుతూ కూడా ఉన్నారని ఆమె గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వగా వారు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే ఈమధ్య కాలంలో ఉండవల్లి ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు.

That YCP woman MLA needs life protection Another commotion in Guntur district
That YCP woman MLA needs life protection Another commotion in Guntur district

ముఖ్యంగా పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని ఇసుక అక్రమ రవాణాకి సహకరిస్తున్నారని ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న కొందరిని పట్టుకున్న సీఐని ఆమె ఫోన్ లో బెదిరించిన ఆడియో టేప్ కూడా విడుదలైంది. కాగా ఎన్నికల సమయంలో తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఇప్పటివరకు దాన్ని తనకు తిరిగి చెల్లించడం లేదని ఒక వైసిపి కార్యకర్త వీడియో పోస్టింగ్ పెట్టడం కూడా తెలిసిందే.తాజాగా ఉండవల్లి శ్రీదేవి ఎవరిపైనైతే కేసు పెట్టారో ఆ ఇద్దరు (అంటే సందీప్ సురేష్లు)రెండు రోజుల క్రితం బాపట్ల ఎంపీ నందిగం సురేష్బాబు ,ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై అవినీతి ఆరోపణలు చేశారు.వారు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని దళితుల భూములు లాక్కుంటున్నారని టిడిపి వారికి సాయపడుతున్నారని ఆ ఇద్దరు చెప్పారు.ఇది జరిగిన రెండో రోజే ఎమ్మెల్యే వారిపై కేసు పెట్టడం ఇక్కడ గమనార్హం అయితే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కథనం మరోలా ఉంది .

That YCP woman MLA needs life protection Another commotion in Guntur district
That YCP woman MLA needs life protection Another commotion in Guntur district

పేకాట క్లబ్బులు నడుపుతూ అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తూ….వీరిద్దరూ పెదకాకాని పోలీసులకు పట్టుబడగా వారిని వైసీపీ నాయకత్వం పార్టీ నుండి సస్పెండ్ చేసిందని,ఇదేదో తాను చేయించినట్లుగా వారు భావించి తనను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.తనే మాట్లాడుతున్నట్టు భ్రమింపజేసే ఫోన్లు అధికారులకు చేసి వారిని బెదిరించడం,వాటిని మీడియాకు లీక్ చేయడం చేస్తున్నారన్నారు.ఈ విధంగా వారు తనను బ్లాక్మెయిల్ చేయటమే కాకుండా ఈమధ్య తనను అనుసరిస్తున్నారని వారి వల్ల ప్రాణహాని ఉందని ఆమె చెప్పారు.అయితే సందీప్ ,సురేష్లు ఈ ఆరోపణలను ఖండించారు .ఎంపీ, ఎమ్మెల్యేల పై అవినీతి ఆరోపణలు చేయడం వల్లే తమపై అక్రమ కేసులు పెట్టారని వారు తెలిపారు.మొత్తం మీద ఈ వ్యవహారం గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!