NewsOrbit
న్యూస్

అదండీ అసలు సంగతి ! ఏమయ్యేను ఆంధ్రప్రదేశ్ గతి ?

Share

మొన్నటివరకూ కట్టడితో ఉన్న ఏపీలో ఉన్నట్లుండి ఇంత భారీ ఎత్తున కరోనా కేసులు ఎలా నమోదవుతున్నాయి? ఉన్నట్లుండి ఇంత భారీగా కేసులకు కారణం ఏమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది.

 

శనివారం రెండున్నర వేల పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆదివారం ఏకంగా ఐదు వేల కేసులకు పైనే నమోదయ్యాయి. ఈ రోజు (సోమవారం) కొత్తగా నమోదైన కేసులు నాలుగువేలకు పైనే. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా కేసులు 53వేల అంకెను దాటిపోయాయి.

ఇందులో ఇప్పటికే కోలుకున్న వారు 24వేలు ఉంటే.. యాక్టివ్ కేసులు 28800 కేసులు ఉన్నాయి. మొత్తం పదమూడు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు నమోదు అయితే.. తర్వాతి స్థానం గుంటూరు జిల్లా నిలిచింది. అక్కడ 596 మందికి పాజిటివ్ గా తేలింది. తర్వాత స్థానం కర్నూలు జిల్లాగా చెప్పాలి. ఈ రోజు 559 కేసులు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లా ట్రిపుల్ ఫిగర్ ను దాటేశాయి. వీటిల్లో ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం అతి తక్కుగా 56 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇంతకూ ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదు అవుతున్నట్లు? అన్నది క్వశ్చన్. మొన్నటి వరకూ కేసులు పెద్దగా లేని ఏపీలో.. ఉన్నట్లుండి ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొత్త నిజం బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో భారీగా పెరిగిపోతున్న కేసులకు భయపడిన లక్షలాది మంది తెలంగాణ నుండి ఏపీలోని తమ సొంతూళ్లకు తరలి వచ్చేశారు.

హైదరాబాద్ లో కరోనా ముప్పు నుంచి వచ్చే క్రమంలో చాలామంది అక్కడ నుంచి వైరస్ మరకల్ని తీసుకొచ్చి.. ఊళ్లల్లో అంటించేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.మొత్తానికి తెలంగాణ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోతుంది చెప్పవచ్చు.దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో చూడాలి!




Share

Related posts

హస్తినకు తెలుగు రాష్ట్రాల సీఎంలు క్యూ..! ఎందుకోసమో..!?

somaraju sharma

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత .. రేపు ఈడీ ముందుకు..?

somaraju sharma

ఈటీవీ జబర్దస్త్ : గుడ్ బై చెప్పబోతున్న సుడిగాలి సుధీర్ ? కారణం ఇంత చిన్నదా ?

GRK