NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్క ఎంపీ సీటు కోసం ముగ్గురు మంత్రుల యుద్ధం… ఎవ్వ‌రూ త‌గ్గేదేలే…!

ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు మంత్రులు పోటీపడుతున్నారు. ముగ్గురు మంత్రులు కూడా ఎవరికి వారే సీటు తమ వాళ్ళకే రావాలి అంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి ? అనేదానిపై అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఆ ఎంపీ సీటు ఏదో కాదు తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు సీటు. ఈ పార్లమెంటు సీటు కోసం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నారు. దీంతో ఇది కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక సంబంధించి సెంట్ర‌ల్‌ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది.

The battle of three ministers for one MP seat... No one will be short...!
The battle of three ministers for one MP seat… No one will be short…!

ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు సీటు ఎవరికి ఇస్తారు ? అన్నది అంతు పట్టటం లేదు. ఇక్కడ నుంచి బిఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు మరోసారి ఖరారు అయింది. బిఆర్ఎస్ లో పోటీ లేకపోవడంతో నామా పేరు కెసిఆర్ ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్ సీట్ కోసం మంత్రులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఎవరికి వారు తమ వర్గానికి చెందినవారికి టికెట్ ఇప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి – తుమ్మల నాగేశ్వరరావు కమ్మ కోటాలో తన తనయుడు తుమ్మల యుగంధర్ కు – ఇటుబట్టి విక్రమార్క తన భార్య మల్లు నందిని కి ఎంపీ టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్‌ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనక తాను ఎంతో కష్టపడ్డానని బట్టి చెప్పుకుంటున్నారు. అయితే అటు బట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ క‌ర్నూల్ టికెట్ ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇక్కడ నందిని కి ఛాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక పొంగులేటి విషయానికి వస్తే ఆయన గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్లో చేరారు.

The battle of three ministers for one MP seat... No one will be short...!
The battle of three ministers for one MP seat… No one will be short…!

పొంగులేటి కాంగ్రెస్లో చేరాక తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందని చర్చ ఉంది. దీనికి తోడు ఆర్థికంగా కూడా ఆయన పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బిఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను అని శపథం చేశారు. ఒక్క‌ భద్రాచలంలో మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘనవిజయం సాధించారు. విచిత్రం ఏంటంటే భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటి మనిషి కావడం విశేషం. ఆయ‌న ఎప్పుడు అయినా కాంగ్రెస్‌లోకి వ‌చ్చేయ‌వ‌చ్చు.

అందుకే తాను పడిన కష్టానికి గుర్తుగా తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఇక తుమ్మ‌ల నాగేశ్వరరావు విషయానికి వస్తే కమ్మ కోటాలో తన తనయుడు యుగంధర్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సీటును రేణుక చౌదరి ఆశించారు. ఆమెకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు. లేకపోతే ఖమ్మం పార్లమెంటు సీటు కోసం కాంగ్రెస్లో మరింత గట్టి పోటీ ఉండేది.

The battle of three ministers for one MP seat... No one will be short...!
The battle of three ministers for one MP seat… No one will be short…!

ఇక తెలంగాణ వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ అవటంలో తుమ్మలపాత్ర ఎంతో ఉందని.. కమ్మ సామాజిక వర్గం నమ్ముతోంది. పైగా రాష్ట్రంలో రెడ్డి వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. కమ్మ సమస్య వర్గానికి ఆప్షన్ గా ఉన్న ఒకే ఒక సీటు ఖమ్మం. అందుకే ఈ సీటు తన తనయుడికి ఇవ్వాలని తుమ్మల కోరుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్గా మారిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N