Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రాబోయే రోజుల్లో రవితో ఆ కంటెస్టెంట్ కి మధ్య అతి పెద్ద గొడవ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో… టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి యాంకర్ రవి. బుల్లితెరపై.. తన మెస్మరైజింగ్ యాంకరింగ్ తో… అనేకమందిని అలరించిన రవి.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో.. ప్రారంభంలో అతడి ఆటతీరుపై బిగ్ బాస్ వీక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని రవి ఉండటంతో ఆ రీతిగా అందరూ భావించారు. ఎందుకంటే ప్రముఖ టెలివిజన్ షోలలో రవి వేసే పంచ్ డైలాగులు.. ఎంతగానో అలరించేవి. ఆ రీతిగానే ఇంటిలో యాంకర్ రవి ఫన్ క్రియేట్ చేస్తారని.. భావించగా.. అది అట్టర్ఫ్లాప్ అయిపోయింది. కారణం చూస్తే రవి తన గేమ్ బదులు ఇతరులను ప్రభావితం చేయడమే ఎక్కువగా పనిగా పెట్టుకున్నారు.

ఆ రీతిగానే ఆ సమయంలో కెమెరాల ముందు వాళ్ళ మాటలు వీళ్ల దగ్గర వేరే వాళ్ల దగ్గర.. తప్పుగా మాట్లాడుతూ ఉండటంతో ఆ ఫుటేజ్ వీడియోలు బయట పడటంతో రవి ఆడుతున్న గేమ్ చాలావరకు అర్థమైపోతుంది. ప్రియా లహరి మధ్య జరిగిన గొడవకి సంబంధించి.. రవి ఏ ప్రధాన కారణమని.. ఫుటేజ్ బయటపడటమే నిదర్శనం. ఇదే క్రమంలో నటరాజు మాస్టర్ రవి ని గుంటనక్క అని పోల్చటం… ఆ రీతిగానే రవి వ్యవహరిస్తూ ఉండటంతో.. అతడు తన ఆటతీరు పట్ల చాలామంది అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా షణ్ముక్ .. రవి ఆడుతున్న ఆట తీరుపై 29వ రోజు ఇంటిలో వేసిన డైలాగులు, అంతకుముందు… ఐదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకు ముందు.. రవి తన దగ్గరకు వచ్చిన టైంలో నీవల్ల నేను ప్రభావితం అవుతున్నట్లు షణ్ముఖ్ జస్వంత్ డైలాగ్ వేయటంతో రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య హౌస్ లో టాఫ్ ఫైట్ ఉండటం గ్యారెంటీ అని జనాలు అంటున్నారు.

Bigg Boss Telugu 5 contestants: From Ravi to Jaswanth Shanmukh, here's a  look at the rumoured contestants of the upcoming season

షణ్ముక్ కూడా గట్టిగానే రవి వేసిన ప్రశ్నలకు సమాధానం

29వ రోజు జరిగిన ఎపిసోడ్ లో నీతో దూరంగా ఉన్నంత మాత్రాన దర్పం సరిగా చేయడం లేదని మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ రవి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటంతో.. పాటు అదే సమయంలో రవి అంత హర్ష్ గా మాట్లాడకూడదు అంటూ ఎదుటి వాళ్లు…  చెప్పేది కూడా వినిపించు కోవాలని షణ్ముక్  తో… డిస్కషన్ పెట్టడంతో అదే సమయంలో షణ్ముక్ కూడా గట్టిగానే రవి వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య రాబోయే రోజులలో బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రగడ జరగటం గ్యారెంటీ అని జనాలు బయట డిస్కషన్ లు చేసుకుంటున్నారు. పైగా 5వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… ఇంటిలో సభ్యులంతా చాలావరకు షణ్ముక్ కి… ఓట్లు వేయటంతో.. ఓటింగ్ ప్రక్రియ మొత్తం బిగ్బాస్ బయటపడటంతో.. షణ్ముఖ్ జస్వంత్..కూడా  ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ చేసా అని డైలాగ్  వేయటం జరిగింది.

ఐదో వారంలోనే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో

మరోపక్క హౌస్ లో చాలామంది కంటెస్టెంట్ లతో గతంలో మాదిరిగా కాకుండా నువ్వానేనా అన్నట్టుగా.. షణ్ముఖ్ .. ఆన్సర్ లు ఇస్తూ ఉండడం విశేషం. పైగా షణ్ముక్ పక్కన ఉండే జెస్సి కూడా రవి అంటే మరింత పీకల దాకా కోపం ఉండటంతో.. కుదిరితే ఐదో వారంలోనే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో… భారీ గొడవలు జరిగే అవకాశం ఉందని జనాలు భావిస్తున్నారు. హౌస్ లో షణ్ముక్, జెస్సీ, సిరి ముగ్గురు కలిసి పెట్టిన గ్రూప్.. హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగిందని.. ఈ క్రమంలో ఎక్కువగా మాత్రం రవికి షణ్ముఖ్ కి.. మధ్య పెద్ద గొడవ జరగడం గ్యారెంటీ అని అంటున్నారు.


Share

Related posts

Moringa: ఆరోగ్యానికి పర్మినెంట్ అడ్రస్ ఈ ఆకు..!! 

bharani jella

Sonu Sood: ‘రియల్ హీరోలు ప్రజలే’

somaraju sharma

19 ఏళ్ళ కరోనా పేషంట్ ను ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో చూడండి..! 

arun kanna