టాలీవుడ్ లో 3 సినిమాలు కమిటయిన ఆ బాలీవుడ్ హీరోయిన్ టార్గెట్ వాళ్ళే అంటున్నారు ..?

సాయీ మంజ్రేకర్ .. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ నట వారసురాలిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ సీక్వెల్ దబాంగ్ సిరీస్ లో వచ్చిన దబాంగ్ 3 లో నటించింది. ఈ సినిమాతో సాయీ మంజ్రేకర్ బాలీవుడ్ లో బాగానే ఆపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ కన్ను ఇప్పుడు టాలీవుడ్ మీద పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో 3 సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.

Saiee Manjrekar to romance Varun Tej - TV9 Telugu

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించబోతున్న బాక్సర్ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుందని ఇంతకముందే ప్రకటించారు. సాయీమంజ్రేకర్ కి టాలీవుడ్ లో ఇదే డెబ్యూ సినిమా. కిరన్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎప్పుడైతే మెగా హీరో సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుందని తెలిసిందో టాలీవుడ్ మేకర్స్ అందరు సాయీ మంజ్రేకర్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారు. తమ ప్రాజెక్ట్ లో సెట్ అయితే డేట్స్ లాక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

అలాగే ఇప్పుడు అడవి శేష్ నటిస్తున్న మేజర్ సినిమాలో నటిస్తున్నట్టు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమా సర్కారు వారి పాట లోనూ సాయీ మంజ్రేకర్ ఒక హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్ ఫైనల్ అయింది. ఈ క్రమంలో సాయీ మంజ్రేకర్ డేట్స్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది.

Saiee Manjrekar roped in for 'Major' co-starring Adivi Sesh | Hindi Movie News - Times of India

గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా ఎంతో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇలా వరసగా మూడు భారీ ప్రాజెక్ట్స్ లో కమిటయిన సాయీ మంజ్రేకర్ కి టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ సాధించాలనేదే టార్గెట్ గా పెట్టుకుందని సమాచారం. ప్రస్తుతం ఆ ప్లేస్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న ఉన్న సంగతి తెలిసిందే.