NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎంపీ క్యాండెట్లు చూస్తే మైండ్ బ్లాక్‌… అంతా వాళ్లే….!

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. పదేళ్లపాటు తెలంగాణను ఏక చక్రాధిప‌త్యంగా ఏలిన కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ కు పలువురు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయటం కలకలం రేపుతోంది. పెద్దప‌ల్లి, జ‌హీరాబాద్ ఎంపీలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసేశారు. నాగర్ క‌ర్నూల్ ఎంపీ ది కూడా అదే దారి. ముగ్గురి ఎంపీలు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోగా మరికొందరు ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు.

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు – చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తితో లేరని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు.. పట్టున్న నేతలు ఎవరూ కూడా ఇష్టపడటం లేదు. దీంతో జూనియర్ నేతలను.. పలువురు వారసులను ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయించారని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ కు తుంటి ఎముకకు గాయం కావడంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు టైం కేటాయించటం లేదు. ఇటీవ‌ల చాలా గ్యాప్ త‌ర్వాత న‌ల్ల‌గొండ బ‌హిరంగ స‌భ‌కు మాత్ర‌మే ఆయ‌న హాజ‌ర‌య్యారు.

దీంతో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో కూడా అభ్యర్థులు ఎంపిక బాధ్యత ప్రధానంగా కేటీఆర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు.. కీలక నేతలతో సమావేశం అవుతూ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటానని చెబుతున్నారు. ఆయ‌న‌ను ఎంత బ‌తిమిలాడినా కూడా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ప్ర‌త్యామ్నాయం చూస్తున్నార‌ట‌.

సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్, వరంగల్ నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా వార‌సులే కావటం విశేషం. ఇక మల్కాజ్గిరి లేదా చేవెళ్ల స్థానం నుంచి కాసాని వీరేశంను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు.

మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది. ఏది ఏమైనా ఒకే ఒక్క ఓటమి తెలంగాణలో ఎంతో బలంగా ఉందనుకున్న బీఆర్ఎస్ పార్టీ పునాదులను కూకటి వేళ్ల‌తో కదిలించేలా చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకుంటే పరువు దక్కుతున్నట్టు అవుద్ది.. లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju