NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Virus Medicine: కేంద్రమూ, కలెక్టరూ అందరూ ఈ గ్రామాన్ని చూస్తున్నారు.. కొత్త మందుతో కరోనా పరార్..!!?

Corona Virus Medicine: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఇప్పుడు వార్తల్లోని ఊరు అయ్యింది. ఆ గ్రామంలోని ఒక ఇంటిముందు కిలోమీటరు పొడవు క్యూలు కనిపిస్తున్నాయి.ఇదంతా ఎందుకంటే ఈ ఆసక్తికరమైన కథనం చదవాల్సిందే!కరోనా స్వైర విహారం చేస్తున్న వేళ అందరూ కార్పోరేట్ కంపెనీలు, బడా మెడికల్ ఫార్మసీలు తయారుచేస్తున్న మందుల కోసం పోటీ పడుతుండగా,వాటిని బ్లాక్ మార్కెట్లో సైతం వేలు, లక్షలు పోసికొంటుండగా కృష్ణపట్నం లో ఒక వ్యక్తి ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా పై బాగా పనిచేస్తోందని విస్తృత ప్రచారం సాగడంతో అందరూ ఇప్పుడు ఆ వూరి దారి పట్టారు.సోషల్ మీడియాలో ఈ మందు పై అనేక అనుకూల కథనాలు రావడంతో ప్రజలకు నమ్మకం కుదిరి’ఛలో కృష్ణపట్నం’ అంటున్నారు.

The center and the collector are all looking at this village
The center and the collector are all looking at this village

Corona Virus Medicine: ఇది ఆనందయ్య సృష్టించిన అద్భుతం!

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య వైద్య మూలికలు,తేనె ,మిరియాలు,పచ్చకర్పూరం,జీలకర్ర తదితరాలతో ఈ మందును తయారుచేసి ఉచితంగా ఇస్తున్నాడు.ఈ మందు తీసుకుంటే కరోనా రాదని, కోవిడ్ వచ్చినవారు తీసుకుంటే అది నయమవుతుందని ఆనందయ్య చెబుతున్నాడు.నెల రోజుల క్రితమే తాను ఈ మందు తయారు చేసి ఇవ్వడం మొదలు పెట్టానని,అది బాగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో ఇప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో మందు కోసం వస్తున్నారని ఆయన తెలిపారు.ఇప్పటికే ఇరవై వేల మందికి ఈ మందు ఇచ్చినట్టు వెల్లడించారు.తన కుమారుడు లక్ష రూపాయలు ఇవ్వగా దాంతో ముందు తయారీ ప్రారంభించానని,ఇప్పుడు ప్రజలు తనకు మందు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు మూలికలు తెచ్చిస్తున్నారని ఆనందయ్య వివరించాడు.

ఇక్కడే మరో ట్విస్ట్!

ఆనందయ్య ఇస్తున్న ముందు పట్ల పూర్తి సంతృప్తితో ప్రజలు ఉండగా,దాంతో కరోనా నయమైన దాఖలాలు కూడా కనిపిస్తుండగా జిల్లా అధికార యంత్రాంగానికి మాత్రం అనుమానాలు పుట్టుకొచ్చాయి.అసలు ఆ మందు కథాకమామిషు తెలుసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఒక అధికారుల బృందాన్ని కృష్ణ పట్నం పంపారు.జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి,ఆయుష్ డాక్టర్లు,ఆర్డీవో సువర్ణమ్మ,డీఎస్పీ హరినాథ్ తదితరులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ గ్రామానికి వెళ్లి విచారణ సాగించారు.మందు నమూనాలను సేకరించారు.మందు కోసం వచ్చిన వారితో మాట్లాడుతే ప్రతి ఒక్కరూ అది అద్భుతంగా పనిచేస్తోందని అధికారుల బృందానికి తెలిపారు.రెమిడీసీవరు ఇంజక్షన్ కన్నా ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తోందని వివరించారు. తమ అనుభవాలను అధికారులకు వివరించడంతో వారు కూడా చేసేదేమీ లేక జిల్లా కలెక్టర్ కి నివేదిక పంపుతామంటూ వెనక్కి మళ్లారు.ఏ ఒక్కరు కూడా ఈ మందుకు వ్యతిరేకంగా చెప్పలేదని డీపీఓ ధనలక్ష్మి వెల్లడించటం ఇక్కడ విశేషం.చివరకు స్థానిక శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ మందు గురించి అనుకూలంగానే మాట్లాడారు.

అకస్మాత్తుగా మందు పంపిణీ పై ఆంక్షలు!

అయితే ఈ బృందం తిరిగి వెళ్ళి జిల్లా కలెక్టర్ కి ఏమి నివేదిక ఇచ్చిందో గానీ బుధవారం నుండి ఈ మందు పంపిణీ పై ఆంక్షలు విధించారు. ఆయుష్ సంస్థ ఈ మందును పరీక్షించి నివేదిక ఇచ్చే వరకు పంపిణీని ఆపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.కృష్ణ పట్నానికి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు సైతం పహారా కాస్తున్నారు ఇప్పటివరకు ముందు బాగా పని చేస్తుందన్న రిపోర్ట్స్ ఉండవచ్చు రేపేదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అన్నది కలెక్టరుగారి ప్రశ్న!ముందు జాగ్రత్త చర్యగానే ఈ మందు పంపిణీని నిలిపివేసినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.సామాన్యుడికి ఉచితంగా లభిస్తున్న సంజీవని లాంటి మందును దూరం చేస్తారా అని వారు భగ్గుమంటున్నారు.అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని పెదవి విరుస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!