పేద దేశాలను ఆదుకోవడం కోసం కేంద్రం కీలక నిర్ణయం..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ఇండియా ఇటీవల అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడీ చేతుల మీదగా జనవరి 16 వ తారీఖున రిలీజ్ అయిన వ్యాక్సిన్ ఇప్పటికే ప్రభుత్వ సిబ్బందికి వేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదిలా ఉంటే తాజాగా పేద దేశాలను ఆదుకోవడం కోసం మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

PM modi rally in Khargone: Ab ki baar 300 paar, phir ek baar Modi sarkar:  Modi in MPమేటర్ లోకి వెళ్తే దాదాపు ఎనిమిది దేశాలకు ఇండియా వ్యాక్సిన్ పంపించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలో పేద దేశాలు గా పిలవబడే మయన్మార్, మంగోలియా, మాలి, ఓమన్, బంగ్లాదేశ్ అదే విధంగా మరి కొన్ని దేశాలకు పంపించడానికి మొత్తం ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి.

 

మొదటినుంచి వ్యాక్సిన్ ప్రపంచానికి అందించే సత్తా ఉన్న దేశం ఇండియా అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. దాదాపు ప్రపంచంలో ఉండే 75% ఫార్మా రంగం ఇండియాలోనే ఉండటంతో.. ధనిక దేశాలు కూడా ఇండియా యొక్క వ్యాక్సిన్ పనితనం పై క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండగా ఫలితాలు సానుకూలంగా వస్తున్న నేపథ్యంలో.. భారీగా ఆర్డర్లు చేయడానికి రంగంలోకి దిగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ధనిక దేశాల ఆర్డర్లను తీసుకుంటూనే మరోపక్క పేద దేశాలను ఆదుకోవడం కోసం కేంద్రం వ్యాక్సిన్ విషయం లో ముందడుగు వేయడం తో.. ఇండియా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.