NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Ration Door Delivery : రేషన్ డోర్ డెలివరీని ఢిల్లీలో నిలిపేసిన కేంద్రం !ఏపీపై కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం?

Ration Door Delivery : ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసే రేషన్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. మార్చి ఇరవై అయిదు నుండి ప్రారంభం కానున్న ఢిల్లీ ప్రభుత్వ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

The center that stopped ration door delivery in Delhi! Likely to have that effect on AP too?
The center that stopped ration door delivery in Delhi! Likely to have that effect on AP too?

అంతేగాకుండా జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం పంపిణీ చేసే ఆహార ధాన్యాలను కొత్త పేర్లతో కానీ, పథకాలతో కానీ సరఫరా చేయడానికి రాష్ట్రాలకు అనుమతులు లేవని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కాగా, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పథకం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని సీఎం కేజ్రీవాల్ స్కీమ్ తీసుకొచ్చారు. మార్చి 25 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకం కింద ప్యాకేజ్ చేసిన గోధుమపిండి, బియ్యం, చక్కెర లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతలో కేంద్రం…కేజ్రీవాల్ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చింది.

Ration Door Delivery : ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా?

రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ ని నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో అందరి చూపు ఏపీపై పడింది. ఎందుకంటే, ఏపీలో జగన్ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల సాయంతో రేషన్ సరుకులను లబ్దిదారులకు నేరుగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. సీఎం జగన్ బొమ్మలతో ప్రత్యేకంగా గుర్తించిన బ్యాగుల్లో బియ్యం ఇస్తున్నారు. అలాగే ప్యాకేజ్ చేసిన చక్కెర, కందిపప్పు ఇస్తున్నారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేసి మరీ.. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని కొనసాగించారు సీఎం జగన్. అంటే, ఈ స్కీమ్ ను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది.అయితే జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని కేంద్రం స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం కేటాయించిన ధాన్యాన్ని మరే ఇతర పథకం ద్వారా పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అనుమతి లేదని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ రూల్స్ ని గుర్తు చేసిన కేంద్రం..ఢిల్లీ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం.. మరిప్పుడు ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా? లేక కేంద్రం బ్రేకులు వేస్తుందా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju