న్యూస్

ఈఫిల్ టవర్‌నే అమ్మి పారేశాడు!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

చార్మినార్ అమ్ముతాను కొంటావా అనే జోక్ గతంలో అప్పుడప్పుడూ వినబడేది. ఈ డైలాగ్ ఏదో సినిమాలో కూడా పెట్టిన గుర్తు. నిజంగానే ఎవరన్నా చార్మినార్ అమ్మగలిగితే? చార్మినార్ కాదు ఏకంగా పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్  టవర్‌నే అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. పెట్టడమే కాదు అమ్మాడు కూడా. విచిత్రంగా ఉందా? రండి విక్టర్ లస్టిగ్ గురించి తెలుసుకుందాం.

విక్టర్ లస్టిగ్ అసలు పేరు రాబర్ట్ వి మిల్లర్. 1890లో ఆస్ట్రియా – హంగరీలో జన్మించాడు. పారిస్‌లో చదువుకునే రోజుల్లో జూదం, జేబులు కొట్టడం వంటి అలవాట్లకు మరిగాడు. నమ్మించి మోసం చేసే కళలో క్రమేపీ ఆరితేరాడు. ఇప్పటికి సరిగ్గా 130 ఏళ్ల క్రితం అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన కోసం పారిస్ నగరంలో ఈఫిల్ టవర్ నిర్మించారు. ప్రదర్శన ముగిసిన తర్వాత టవర్‌ను తొలగించాలని కొందరు డిమాండ్ చేశారు. అదుగో ఆ వార్త చూసిన తర్వాత లస్టిగ్ మెదడులో మెరిసిందో ఐడియా.

ఈఫిల్ టవర్‌ను పడగొట్టి ఆ ఉక్కును తుక్కు వ్యాపారులకు విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ అందుకు సంబంధించి దొంగ పత్రాలను రూపొందించాడు. తుక్కు వ్యాపారుల్లో గట్టి వారిని అయిదుగురిని గుర్తించాడు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే గగ్గోలు పుడుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిని చాలా రహస్యంగా ఉంచిందనీ , చివరి వరకూ అంతా రహస్యంగా ఉండాలనీ వారితో నమ్మబలికాడు.

ఆ అయిదుగురిలో యాండ్రీ పోసాన్ అనే వ్యాపారి తనకు పనికి వస్తాడన్న అంచనాకు వచ్చిన లస్టిగ్ అతనిని విడిగా కలిశాడు. అతనికే ఈఫిల్ టవర్ అమ్మేందుకు లంచం కూడా తీసుకున్నాడు. మొత్తం మీద 70 వేల డాలర్ల నగదు  తీసుకుని ఆస్ట్రియాకు పరారయ్యాడు. ఆ డబ్బు ఇప్పుడు పది లక్షల డాలర్లతో సమానం.

లస్టిగ్ ఆమాయకులకు విక్రయించిన కరెన్సీ నోటును రెండుగా చేసే పెట్టె ఇదే. 

తాను మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోసాన్ సిగ్గుతో పోలీసుల దగ్గరకు వెళ్లకుండా నోరు మూసుకుంటాడని లస్టిగ్ అంచనా వేశాడు. తన అంచనా కరెక్టేనని తేలిన తర్వాత పారిస్ తిరిగి వచ్చి మళ్లీ రెండవ సారి ఈఫిల్ టవర్ అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి అదృష్టం కలిసిరాలేదు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. లస్టిగ్ వెంటనే అమెరికాకు పారిపోయాడు.

అమెరికాలో కూడా లస్టిగ్ చాలా రకాలుగా నమ్మించి మోసగించే పనులు చేశాడు. ఏ కరన్సీ నోటు లోపల పెడితే ఆ నోటును రెండుగా చేసే పెట్టెను విక్రయించడం అందులో ఒకటి. ఈ పెట్టెకు రుమేనియన్ బాక్స్ అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లు ముద్రించే పని మొదలుపెట్టాడు. చివరికి లస్టిగ్‌ను పోలీసులకు ఆతని గర్ల్ ఫ్రెండ్ పట్టించింది. మరో అమ్మాయితో తిరుగుతున్నాడన్న కోపంతో ఆమె లస్టిగ్ గురించి పోలీసులకు చెప్పింది. విచారణ సమయంలో లస్టిగ్ ఒకసారి జైలు నుంచి తప్పించుకున్నాడు కూడా. చివరికి మళ్లీ పట్టుబడి కోర్టులో నేరం అంగీకరించి జైలుకు వెళ్లాడు. అక్కడ లస్టిగ్ న్యూమొనియాతో మరణించాడు. నమ్మించి మోసం చేసే కళలో లస్టిగ్‌ను మించిన ఆర్టిస్టు ఇంతవరకూ లేడని ప్రతీతి.

లస్టిగ్ మీద తయారయిన ఈ వీడియో చూడండి:

Video Courtesy: Cheddar


Share

Related posts

Telangana High Court: జగన్ కేసుల్లో హైకోర్టు బిగ్ షాక్ ..! వాయిదా కోరితే రూ.50వేలు జరిమానా అంటూ హెచ్చరిక..!!

somaraju sharma

మూడో రకం కరోనా.. ఆఫ్రికా దేశాల సరిహద్దులు క్లోజ్ చేసిన యూరప్ దేశాలు..??

sekhar

ఇన్‌ఫార్మర్‌లు అన్న నెపంతో…

somaraju sharma

Leave a Comment