Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో టాప్ మోస్ట్ ఓటింగ్ రాబడుతున్న ఆ కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో .. 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ కావడం తెలిసిందే. అయితే ఐదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కి సంబంధించి తొమ్మిది మంది.. ఎలిమినేషన్ లో ఉన్నారు. ప్రియా, లోబో, ఇంకా ఏడుగురు సభ్యులలో మానస్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓటింగ్ జరుగుతున్న ప్రక్రియ పరంగా చూసుకుంటే మానస్… అధిక శాతం ఓట్లు అందరికంటే రాబడుతున్నాడట. ఎవరితో కూడా పెద్ద గొడవలు పెట్టుకోకుండా చాలా సైలెంట్ గేమ్ ఆడుతూ అందరితో..ఉంటూ.. ఎటువంటి గ్రూపులలో చేరకుండా తన గేమ్ తాను ఆడుతున్నాడు.

Bigg boss season 5: Manas will be among top 5, actor predicts

 

సింగల్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు

ఎటువంటి ఎమోషనల్ కి వెళ్ళకుండా.. సింగల్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుండి స్టార్ట్ అయిన ఓటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు 10 శాతం ఓటింగ్ దక్కించుకుని..మానస్.. అందరికంటే ముందున్నాడు. ఇప్పటికే ఎలిమినేషన్ గండం ఆల్రెడీ ఫేస్ చేయటంతో.. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ కొనసాగితే మానోడు ముందుగానే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు అని… ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు.

Bigg boss season 5 Telugu : బిగ్‌‌బాస్ హౌస్‌‌లో మిస్టర్ కూల్

అనవసరమైన విషయాలలో కి వెళ్లక పోవడం

మానస్ కి.. కుర్ర హీరో తనీష్ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు సందీప్ కిషన్ వంటివారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓటింగ్ పరంగా ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారందరిలో కల్లా.. అత్యధికమైన ఓట్లు మానస్ కి పడుతున్నాయి. అనవసరమైన విషయాలలో కి వెళ్లక పోవడం తో పాటు చాలా వరకు తన గేమ్.. ఆడుతూ వీలైతే మిగతా వారికి సాయం చేసే తరహాలో హౌస్ లో వ్యవహరిస్తున్నాడు. అలాగే వాగ్వాదం విషయంలో.. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. దీంతో హౌస్లో మెచ్యూర్ గేమ్ ప్లే చేస్తున్నాడని బయట జనాలు మానస్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించటం తో పాటు భారీగా ఓట్లు వేస్తూ ఉన్నారు.


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నికల టీడీపీ ఎంపి అభ్యర్థిగా పనబాక

Special Bureau

Prabhas : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ టీజర్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..!

GRK

విజయదశమి కి వకీల్ సాబ్ టీజర్ రానుందా .. ఫ్యాన్స్ కి పండగే ..?

GRK