NewsOrbit
న్యూస్ హెల్త్

Corona Virus: కరోనా హోం కిట్స్ ప్రయోగం మంచిదే !రోగులకు చేరకపోవటమే మైనస్ ?!

Corona Virus: కరోనా వచ్చిందంటే చాలు… ఆసుపత్రులకు పరుగులు తీయాలి.. బెడ్ దొరుకుతుందో లేదో భయం.. దొరికినా నయం అవుతుందా లేదోనన్న సందేహం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉన్నారు. కానీ 85శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు.

The Corona Home Kits experiment is good!
The Corona Home Kits experiment is good

ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ దూకుడు మామూలుగా లేదు. కేసుల సంఖ్య వందలు, వేలు దాటి లక్షలకు చేరుకుంటోంది. యాక్టీవ్ కేసులు వేల సంఖ్యలో చేరుకుంటుండటంతో బెడ్ల సమస్య తీవ్రంగా ఉంది.. అలాగే, ఆరోగ్యం విషమించి ఉపిరాడక ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది. ఇదిలావుంటే, అసలు కరోనా వచ్చిన వారిలో వందకు 85మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అసలు కొందరికి చికిత్స లేకుండానే నయం అవుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యమ్నాయంగా హోం కిట్ల పంపిణీ!

కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటీవ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా…
ఇందుకోసం ఏఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది. ఈ క్విట్ల ద్వారానే కరోనా నయం చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

కరోనా కిట్స్ లో ఏమిఉంటాయంటే

1.విటమిన్ C 500mg ట్యాబ్లెట్స్
2. జింక్ 20mg ట్యాబ్లెట్స్
3. విటమిన్ D3 60000 16 క్యాప్సిల్స్
4. B- కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్
5. పారసిటమల్ 650mg ట్యాబ్లెట్స్
6. సిట్రజిన్ 10mg ట్యాబ్లెట్స్
7. ప్యాంటప్రోజోల్ 40mg ట్యాబ్లెట్స్
8. యాంటిబయోటిక్స్ఈ ఎనిమిది రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్ లు, శానిటైజర్ ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్ఎంలు, ఆశావర్కర్ లు అందజేస్తున్నారు…అయితే ఇవన్నీ సక్రమంగా కరోనారోగులకు చేరగలిగితే ప్రభుత్వ ప్రయత్నం విజయవంతం అవుతుంది.కాకుంటే చాలామందికి ఈ కరోనా కిట్స్ ఉన్నాయనే విషయం తెలియదని చెప్పాలి.ఈ విషయంలో ప్రభుత్వం విస్తృత ప్రచారం సాగించడం ఎంతైనా అవసరం.

author avatar
Yandamuri

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju