NewsOrbit
జాతీయం న్యూస్

Ayaansh Gupta: ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు! పోటీ పడి సమకూర్చిన మంచి హృదయాలు!!

Ayaansh Gupta: హైదరాబాదుకు చెందిన మూడేళ్ల బాలుడి ప్రాణాలు నిలపడానికి దాతలు పోటీపడ్డారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ కొనుగోలుకు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు.వారందరి సాయంతో ఆ ఇంజెక్షన్ ని ఆ బాలుడి తల్లిదండ్రులు కొనుగోలుచేయడమే కాకుండా శుక్రవారం ఇప్పించారు.హైద్రాబాద్ రెయిన్ బో హాస్పిటల్ లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.వివరాల్లోకి వెళితే…

The cost of an injection alone is Rs 16 crore!
The cost of an injection alone is Rs 16 crore

అరుదైన వ్యాధికి అతి ఖరీదైన ఇంజక్షన్!

హైదరాబాద్ కి చెందిన ఆయాన్స్ అనే బాలుడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రఫీ(ఎస్ఎంఎ) అనే వ్యాధి సోకింది.అది నయం కావాలంటే వాడాల్సింది ఒకేఒక ఇంజెక్షన్ ఆని వైద్యులు తేల్చారు.అయితే అది ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఇంజక్షన్.దాని ధర అక్షరాలా పదహారు కోట్ల రూపాయలు అంటే నమ్మశక్యం కాకపోవచ్చు గానీ ఇది నమ్మి తీరాల్సిన నిజం.అమెరికాలోని నోవార్టిస్ కంపెనీ తయారుచేసే zolgensma అనే ఈ ఇంజెక్షన్ ఒక్కటే ఆ వ్యాధికి పనిచేస్తుందని రుజువైంది.

సోషల్ మీడియాలో తల్లిదండ్రుల అభ్యర్థన

అయితే పదహారు కోట్ల రూపాయలు చిన్న మొత్తం కాదు. ఆ బాలుడి తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్థోమత లేదు.ఛత్తీస్ గఢ్ కు చెందిన యోగేశ్ గుప్తా, రూప గుప్తాలు ఉద్యోగాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ తరుణంలో వారి కుమారుడు ఆ వ్యాధి బారిన పడ్డాడు.అయితే డాక్టర్లు ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ కావాలని చెప్పారో తల్లిదండ్రులు తెలివిగా ఆలోచించి సోషల్ మీడియా వేదికగా వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం చేయమంటూ అభ్యర్థనలను పంపారు.తమ ఆర్థిక పరిస్థితిని, బాలుడి విషమ స్థితిని కూడా వారు సోషల్ మీడియాలో వివరించారు.ఫిబ్రవరి ఇరవై నాలుగున వారు ఈ క్రౌడ్ పుల్లింగ్ కార్యక్రమం చేపట్టారు.

స్పందించిన హృదయాలు!

ఆ తల్లిదండ్రుల దీనస్థితికి మనసున్న వారి హృదయాలు కదిలిపోయాయి.భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పలువురు క్రికెటర్లు,అనేక మంది సంపన్నులు విరాళాలు కుమ్మరించారు.మే ఇరవై నాలుగో తేదీకల్లా అంటే రెండున్నర నెలల్లో వారికి కావల్సిన పదహారు కోట్ల రూపాయలు సమకూరాయి.వెంటనే ఆ ఇంజెక్షన్ కు ఆర్డర్ ఇచ్చారు.జూన్ ఎనిమిదివ తేదీన ఇంజెక్షన్ హైద్రాబాద్ చేరుకొంది.కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తన వంతు సహాయం చేసింది.సుమారు ఆరు కోట్ల రూపాయల విలువచేసే దిగుమతి సుంకాన్ని జిఎస్టీని రద్దు చేసింది.

Ayaansh Gupta: హ్యాపీ గా డిశ్చార్జ్ అయ్యాడు!

శుక్రవారం ఉదయం ఆ బాలుడికి ఇంజక్షన్ విజయవంతంగా రెయిన్బో ఆస్పత్రి వైద్యులు ఇచ్చారు. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో బెట్టి అంతా బాగుందని వారు సంతృప్తి చెందాక బాలుడిని డిశ్చార్జ్ చేశారు.అయితే రెండు నెలల పాటు అతి జాగ్రత్తగా బాలుడిని చూసుకోవాలని, ఇంజెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని రెయిన్ బో వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చి పంపారు.తమ కుమారుడికి కొత్త జీవితం ప్రసాదించడానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!