NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క్యాస్ట్ ఈక్వేష‌న్ల ఎఫెక్ట్… జ‌గ‌న్ ఆ రెండు బీసీ కులాల దెబ్బ‌…!

కీల‌క‌మైన విశాఖ జిల్లాలో వైసీపీకి ఈ సారి కూడా దెబ్బ ప‌డిపోతుందా? క్యాస్ట్ ఈక్వేష‌న్లు.. వైసీపీకి ఇబ్బం దిగా మారుతున్నాయా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ హ‌వా, జ‌గ‌న్ పాద‌యాత్ర వంటివి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భావం చూపించిన‌ప్పుడే ఇక్క‌డ టీడీపీ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంపై స‌హ‌జంగా ఏర్ప‌డే వ్య‌తిరేక‌త‌తో పాటు.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోకపోవ‌డం.. మ‌రింత ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో గ‌వ‌ర స‌మాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. వీరిలో కీల‌క‌మైన నాయ‌కులుగా దాడి వీరభ‌ద్ర‌రావు, కొణతాల రామ‌కృష్ణ‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. వీరిని వైసీపీ వ‌దిలే సుకుంది. వీరిద్ద‌రూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. కొణతాల‌.. జ‌న‌సేన వైపు మొగ్గు చూపారు. దాడి ఇప్ప‌టికే టీడీపీలో చేరిపోయారు. దీంతో గ‌వ‌ర సామాజిక వ‌ర్గం ప్ర‌భావం చూపించే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విశాఖ ప‌రిదిలో మొత్తం 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో అత్య‌ధిక స్థానాలు ఉన్న జిల్లా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ రాజ‌ధా ని ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ.. ఆ ఊపు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తున్నా.. అధికారంలో ఉన్న వైసీపీ ఏమీ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న‌ను ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా తీసుకువెళ్తున్నాయి. ఇది కూడా వైసీపీకి మైన‌స్‌గా మారింది. అయితే.. సిటీ ప‌రిధిలో ఉన్న నాలుగు ప‌క్క‌న పెడితే.. ఏజెన్సీలో ఉన్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఈ ద‌ఫా.. వైసీపీకి ద‌క్కుతాయా ? అనేది ప్ర‌శ్న‌.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన ప్ర‌భావం ఇటీవ‌ల కాలంలో పెరిగింద‌ని భావిస్తున్న భీమిలి, గాజువాక, పెందుర్తి , అనకాపల్లి, నర్శీపట్నం, ఎలమంచిలి సీట్లలోనూ వైసీపీకి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇక్క‌డ టీడీపీ జనసేన కూటమికి ఆధిక్యత క‌నిపిస్తోంద‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా. 2019 ఎన్నికలలో వైసీపీ 11 సీట్లను గెలుచుకుంది. విశాఖ నగర పరిథిలో నాలుగు సీట్లనూ టీడీపీ గెలుచుకుంది.

ఇపుడు మారిన రాజకీయం కార‌ణంగా వైసీపీ ఇరుకున ప‌డ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. కేవ‌లం 7 నుంచి 8 స్థానాల‌లోనే అది కూడా అతి క‌ష్టం మీద మాత్ర‌మే వైసీపీ గ‌ట్టెక్కే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ వ్య‌తిరేక‌త ఎన్నిక‌ల టైంకు మ‌రింత పెరిగితే వైసీపీ మ‌రింత దిగ‌జారే ఛాన్సులు కూడా ఉన్నాయి. ప్ర‌ధానంగా బలమైన గవర, వెలమ సామాజిక వ‌ర్గాల మద్దతు వైసీపీకి దూరం కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!

జ‌న‌సేన‌లో ఫ్యామిలీ ప్యాకేజ్‌.. ఆ న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్‌..!