Tirupati : తిరుపతి వైపు మళ్లిన “ఫ్యాన్ ” గాలి!స్వయంగా రంగంలోకి దిగిన సీఎం!

Share

Tirupati : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా భారీ మెజార్టీ సాధించాలని పావులు కదుపుతోంది. తిరుపతి ఎంపీ సీటును గెలిచి.. ప్రతిపక్షాలకు సవాల్‌ విసరాలని వైసీపీ భావిస్తోంది.

పార్టీ అధినేత, ఏపీ సీఎం.. జగన్‌ తిరుపతి బైపోల్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంట్‌ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

The "fan" wind turned towards Tirupati ! The CM himself entered the field!
The “fan” wind turned towards Tirupati ! The CM himself entered the field!

ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలపై చర్చించారు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొట్టమొదటి చట్ట సభ ఉపఎన్నిక ఇదే కావడంతో ముఖ్యమంత్రి దీన్ని సీరియస్ గా తీసుకున్నారు.అంతేకాకుండా ఆయన ఏరికోరి తన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తికి తిరుపతి వైసీపీ టిక్కెట్ ఇవ్వడంతో గెలుపు బాధ్యతలు కూడా సీఎం తనపైనే వేసుకున్నారు.

తిరుపతి సిట్టింగ్ వైసిపి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అనారోగ్యంతో మరణించడంతో ఈ ఉపఎన్నిక జరగనుండగా దుర్గాప్రసాదరావు కుమారుడికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి వారిని పక్కకు తప్పించారు.గురుమూర్తిని బరిలోకి దింపారు.

Tirupati ప్రతిపక్ష రహిత రాష్ట్రంగా ఏపీ!

ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల విజయాలతో వైసీపీ జోష్‌ మీద ఉంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ క్లీన్‌స్విప్‌ చేసింది. తాడిపత్రి మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో తిరుపతి లోక్‌సభను కూడా గెలిచి టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదన్న సంకేతాన్ని ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.

టిడిపి బిజెపి కూడా రెడీ!

తిరుపతి పార్లమెంట్‌ బైపోల్‌ను వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలిచి పరువు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని టిడిపి తన తరపు అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే .

అటు బీజేపీ కూడా తిరుపతి విజయంతో…. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ఇవ్వాలని చూస్తోంది. మిత్రపక్షమైన జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇవ్వబోతోంది .కాంగ్రెస్‌ కూడా తిరుపతి స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉబలాటపడుతో౦ది.ఇక వైసీపీ ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తి పేరును ప్రకటించింది. ఉన్నత విద్యావంతుడు కావడంతో ప్రజలు గురుమూర్తిని ఆదరిస్తారని జగన్‌ భావిస్తున్నారు. వెంటనే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఇప్పటికే పార్టీ నేతలను జగన్‌ ఆదేశించారు. ఇవాళ స్వయంగా సీఎం జగనే . పార్టీ నాయకులతో భేటీ అవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.


Share

Related posts

Job Notification: ఇండియన్ కోస్ట్ గార్డులో భారీగా ఖాళీలు..!! దరఖాస్తు చేసుకోండిలా..!!

bharani jella

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

sarath

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh