New District Updates: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు జరిగేపని కాదు!సెన్సస్ రిజిస్టార్ స్పష్టీకరణ !!

Share

New District Updates: ఆంధ్రప్రదేశ్ తో సహా దేశం మొత్తంమీద ఎక్కడా కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు సాధ్యపడదని తేలిపోయింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పదమూడు జిల్లాలను కనీసం ఇరవయ్యారు జిల్లాలుగా విభజించడానికి అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని వైసిపి ప్రభుత్వం తలపెట్టింది.

The formation of new districts in AP is not happening now!
The formation of new districts in AP is not happening now!

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటాయి. ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.ఈ క్రమంలో కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉండటంతో అక్కడక్కడా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఈ సమస్యలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, వారు కొత్త జిల్లాల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం కూడా తెలిసిందే.శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈవిషయంలో చొరవ తీసుకొని ఇరవై అయిదు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు అరకు కేంద్రంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.అంటే మొత్తంగా చూస్తే ఇరవై ఆరు కొత్త జిల్లాలు అన్నమాట.ఇవాళ రేపు ఇది కార్య రూపం దాల్చవు అని భావిస్తున్న తరుణంలో కరోనా వంటి సమస్యల కారణంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వాయిదా పడింది.అయితే ఇప్పుడు భారతదేశ సెన్సస్ రిజిస్ట్రార్ ఇప్పుడు దేశంలో ఎక్కడా కొత్త జిల్లాల ఏర్పాటుకు అవకాశం లేదని ప్రకటన చేశారు

Read More: Target Etala Rajendar: నాయకులకు ఇన్నోవాలు, లక్షలు..! ఈటల కోటలో గేమ్ మొదలు పెట్టిన టీఆరెస్..!?

New District Updates: సెన్సస్ రిజిస్ట్రార్ చెప్పేదేమిటంటే?

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిపాలనా విభాగాల్లో ఎటువంటి మార్పులు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఏ రాష్ట్రమైనా అలాంటి మార్పులు చేస్తే త్వరలో జరిగే 2021 జనగణనలో వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ఆయన వివరించారు.పాత్రికేయుడు ఇ. రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సెన్సస్ రిజిస్ట్రార్ పై మేరకు సమాధానమిచ్చారు.త్వరలో జనాభా లెక్కింపు జరగనుండగా ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలు లేదని కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండే సెన్సస్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.దీన్నిబట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడప్పుడే కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశాలే లేవు.

 


Share

Related posts

జగన్ వద్దన్నారా..? ఈయన వెళ్లలేదా..? ఆ ఎమ్మెల్యే విషయంలో ఏమైంది..!?

Special Bureau

రిలయన్స్ జియో నయా సంచలనం..! ఇక అన్నీ ఒకే దాంట్లో….

arun kanna

బండ్ల గణేష్ కి పవన్ క్రిస్మస్ గిఫ్ట్..!!

sekhar