NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : షర్మిల వెనుక ‘ఆ నలుగురు’? మామూలుగా లేదుగా చెల్లెమ్మ ప్లాన్!!

ABN RK : Doing Journalisam or Any other..!?

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్‌లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ,త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటిగా షర్మిల వెనుక ఎవరు ఉన్నారనే క్లారిటీ వస్తోంది.

The 'four' behind Sharmila? Chellemma plan as usual !!
The ‘four’ behind Sharmila? Chellemma plan as usual !!

YS Sharmila : పక్కా ప్రణాళికతోనే!

షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలనే నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక ఉందని, పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అని పార్టీ రూపకర్త బ్రదర్ అనీల్ అనే అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తూ ఉంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించడం కోసం వైఎస్ సన్నిహితులు కేవీపీ, సూర్యుడు ఆమె వెనుక నడుస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఆత్మగా చెప్పుకోదగ్గ కేవీపీ ఆయన మరణానంతరం తన ప్రాభవం కోల్పోయారు.ఎందుకనో ఆయన జగన్ వైపు రాలేదు కూడా..అలాగే డాక్టర్ రాజశేఖరరెడ్డికి అతి సన్నిహితుడైన సూరీడు సైతం ఆ తర్వాతి కాలంలో తెరమరుగయ్యారు.అయితే వారు షర్మిలకు టచ్లోనే ఉన్నారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు

అంతా తానై అనిల్!

షర్మిల పార్టీ రూపకర్త అనిల్ కుమార్ కాగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో షర్మిల కోసం పనిచేయనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రస్తుతం రాష్ట్రంలో కాస్త వ్యతిరేకత ఉందని, రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.లోటస్ పాండ్‌లో జరిగిన తొలి సమావేశం కూడా బ్రదర్ అనీల్ సారధ్యంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది.

బెంగాల్ ఎన్నికల తర్వాత పీకే ఎంట్రీ!

ఇక ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. అక్కడి ఎన్నికల తర్వాత షర్మిల వెనక ఉండి నడిపిస్తారని అంటున్నారు. షర్మిల వెనుక మాత్రం ప్రస్తుతానికి ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్లుగా వారి సన్నిహితులే చెబుతున్నారు. తాజా పరిణామాలతో రాబోయే రోజుల్లో షర్మిల చేయబోయే రాజకీయం ఎలా ఉండనుంది అనే ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?