NewsOrbit
న్యూస్

చేతిగీతలు మారుతాయోయ్…!!

 

 

పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో అని ఓ కవి అన్నట్లు థాయిలాండ్ కి చెందిన ప్రొఫెసర్ ప్లీ అనే వ్యక్తి ఏకంగా చేతి రేఖలు మారుస్తున్నాడు.
అందరికీ జీవితంలో ఎదగాలని ఆశ ఉంటుంది అందుకోసం వారు తమ జాతకాలను గాని , హస్త సాముద్రికంగాని, చిలక జ్యోతిష్యం కానీ చెప్పించుకుంటూ ఉంటారు.

 

 

హస్త సాముద్రికం అంటే హస్త రేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక శాస్త్రం. భారత దేశంతో పాటు, థాయిలాండ్ , అనేక దేశాల్లో ఇంకా మనుగడలో ఉంది. మన జీవితం మన చేతి రేఖల పై ఆధారపడి ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే అర చేతిలో ఉండే ఒక్కొక్క రేఖ ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది . ఆరోగ్యం , ఆయుష్షు , వివాహం, సంతానం, అదృష్టం ఇలా ఒక్కో రేఖ ఒక్కో అంశాన్ని సూచిస్తాయి . థాయిలాండ్ లోని ప్రజలు కూడా ఈ హస్తసాముద్రికం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ప్రజల నమ్మకాన్ని ఓ కంపెనీ ఇప్పుడు క్యాష్ చేసుకుంటుంది. అర చేతి రేఖలు మార్చుకుని అదృష్టం తెచ్చి పెట్టుకోవచ్చని కృత్రిమంగా తమ అర చేతి రేఖలు సృష్టిస్తామని మహాహేంగ్ ౯౯౯ సంస్థ వివరించింది.

థాయిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ ప్లీ అనే వ్యక్తి గతంలో టాటూలు వేసే వృత్తి చేస్తూ ఉండేవారు. ఇటీవల నొంతబూరి అనే ప్రాంతంలో మహాహేంగ్ 99 99 పేరుతో ఓ కంపెనీ ప్రారంభించింది. ప్రజలు మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను వారికి కావాల్సినట్టుగా మారుస్తామని ఆ సంస్థ ప్రకటించింది . హస్త సాముద్రికం తెలిసిన నిపుణులు హస్తరేఖలు ని చూసి ఏది బలహీనం గా ఉన్నాయో ఏఏ రేఖల్ని మార్చుకోవాలో చెప్తారు. వారు సూచించిన మేరకు కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్త రేఖలు ని మార్చడం కొత్తవి గీయడం వంటివి చేస్తున్నారు.

టాటూల తరహాలోనే అరచేతిలో రంగులు లేకుండా గీతల్ని గీస్తున్నారు. మొదటిలో చర్మం బాగా కందిపోతుంది. తరువాత అవి సహజ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు, కరుణ సంక్షోభంలో కష్టాలు అనుభవిస్తున్నవారు, హస్తరేఖలు మార్చుకోవడం కోసం కంపెనీ ముందు బారులు తీరారు. కనీసం ఇలాగైనా తమ జీవితంలో మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని ఆశతో ఉండేవారే. వారి అవకాశాన్ని మార్చుకున్న సంస్థ లాభాల బాటలో ముందుకు వెళుతుంది. కంపెనీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగడంతో కస్టమర్లు అధికంగా వస్తుండడంతో ప్లీ బిజినెస్ బాగా నడుస్తోంది. దాంతో అతను మరొక బ్రాంచ్ ను కూడా ప్రారంభించాలని అనుకుంటున్నారు. తన హస్తరేఖలు మార్చుకోవడం వలన తన వ్యాపారం కూడా అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. తమ సంస్థ ద్వారా రేఖల్ని మార్చుకున్న పలువురు కస్టమర్లు కూడా చేతి గీత మార్చుకోవడం వలన వారికి మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. కొంతమంది చేతిరేఖలను నమ్మడమే విడ్డూరం .. ఏకంగా సృష్టించడం విచిత్రమే అని అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే ఈ కృత్రిమ రేఖల్ని మార్చుకోవడం వల్ల కొంతమంది జీవితాల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

author avatar
bharani jella

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju