న్యూస్ సినిమా

షూటింగ్‌లోనే ఆ స్టార్ హీరోయిన్‌ని నోటికొచ్చినట్టు తిట్టిన హీరో..!

Share

తమిళ సినిమా అమరావతితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్ సంఘవి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆరతికి మనవరాలిగా ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైంది. సంఘవి తన పదేళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 95 సినిమాలలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అందులో 45 తెలుగు సినిమాలే ఉండటం విశేషం. మిగతావి కన్నడ, తమిళ సినిమాలు. తెలుగులో రవితేజతో కలిసి నటించిన ‘సింధూరం’ సినిమా వల్ల ఆమెను ఎన్నో అవకాశాలు వరించాయి. ఈ మూవీలోని నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం కూడా పొందింది సంఘవి. అయితే ఆమెను ఒక స్టార్ హీరో ఓ విషయంలో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఎందుకు? అనేది తెలుసుకుంటే..

షూటింగ్‌లోనే తిట్టిన ఆ హీరో

సంఘవి తమిళ హీరో విజయ్ ఒక సినిమా షూటింగ్‌లో తనని తిట్టాడని ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అప్పట్లో విజయ్, సంఘవి కలిసి రాసిగన్, కోయంబత్తుర్ మాపిలై, విష్ణు, నిలవేవా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే విష్ణు సినిమా షూటింగ్ టైమ్‌లో ఒక సీన్ నీటిలో దిగి డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు సంఘవి నీటిలోకి దిగి విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉందట. కానీ విజయ్ మాత్రం నీళ్లు చల్లగా ఉన్నాయని లోపలికి దిగడానికి సాహసించలేదు. అదంతా చాలా సేపటినుంచి గమనిస్తున్న విజయ్ తండ్రి దర్శకుడు చంద్రశేఖర్ కి కోపం వచ్చి ఆడపిల్ల సంఘవి ధైర్యంగా నీటిలోకి దిగింది. మగాడివి నువ్వు నీటిలోకి దిగడానికి ఎందుకు ఆలోచిస్తున్నావ్ అంటూ విజయ్ ని తిట్టిపోశాడట. దాంతో విజయ్‌కి కోపం వచ్చి.. “ఇదంతా నీవల్లే జరిగింది” అని సంఘవికి చివాట్లు పెట్టి, బాగా తిట్టాడట. ఈ సంఘటన జరిగి దాదాపు 10 ఏళ్లు గడిచాయి. సంఘవి మాత్రం ఆ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించిన సంఘవి తెలుగు దర్శకుడు వర్మతో ప్రేమలో పడింది. రాజశేఖర్ నటించిన సినిమాకి అతను దర్శకత్వం వహించాడు. కొన్నాళ్లకు వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆపై బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుని సెటిలయింది. ప్రస్తుతం సంఘవి తమిళంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆమె తల్లి పాత్రల్లో నటిస్తూ బుల్లితెరలోని సీరియల్స్ తోపాటు కొన్ని షోలలో కూడా హోస్ట్ గా చేస్తుంది. స్నేహ, వీణ లాంటి హీరోయిన్స్ ఆమెకి ప్రాణ స్నేహితులు. అంతేకాకుండా చాలా మంది స్టార్ హీరోలకి సంఘవి ఫస్ట్ హీరోయిన్ కావటం విశేషం.


Share

Related posts

Intinti Gruhalakshmi: అంకిత కల నెరవేర్చిన తులసిపై ఈ రేంజ్ లో అంకిత పగ తీర్చుకుంటుందా..!? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సీన్..

bharani jella

గ్రాండ్  ఫినాలే ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ అదే..!!

sekhar

Kota Srinivas Rao: ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ఉన్న హీరో అతనే అంటూ కోట సెన్సేషనల్ కామెంట్స్..!!

sekhar