NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మూడు రాజధానులు విషయంలో హైకోర్టు తీర్పే కీలకం..??

Share

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు మూడు రాజధానులు చుట్టూ తిరిగాయి. అమరావతి రాజధాని తో పాటు కర్నూల్ అదేవిధంగా విశాఖపట్టణానికి జగన్ ప్రభుత్వం రాజధానిని విస్తరించి.. అభివృద్ధి వికేంద్రీకరణ తెలపటంతో చాలామంది వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది.

aphcaa | Andhra Pradesh High Court Advocate Associationఈ క్రమంలో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన వాళ్లు ఈ మూడు రాజధానులు విషయంలో హైకోర్టులో పిటిషన్ వేయడం మనకందరికీ తెలిసిందే. సరిగ్గా విశాఖపట్టణానికి అదే విధంగా కర్నూలు కి రాజధాని తరలించే సమయంలో ఈ పిటిషన్ వేయడంతో హైకోర్టులో ఏపీ రాజధాని మేటర్ ఉంది. ఈ విషయంలో హైకోర్టు స్టే విధించడం జరిగింది.

ఇదిలా ఉంటే హై కోర్టులో తీర్పు రాకముందే కొంతమంది 3 రాజధానుల కు మద్దతుగా ఉండేవాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా.. అక్కడ అశోక్ భూషణం ధర్మాసనం మూడు రాజధానులు జీవో మీద హైకోర్టు స్టేలు తొలగించడానికి నిరాకరించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాజధాని అది రాష్ట్ర హైకోర్టులో స్టేకి సంబంధించి విచారణ.. జరుగుతున్నది కాబట్టి అది కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం తెలిపింది. ఏదిఏమైనా హైకోర్టు లో 3 రాజధాని విషయంలో తీర్పు వచ్చాక మాత్రమే కలుగజేసుకోవలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు విషయంలో హైకోర్టు విధించిన స్టే పై ఎటువంటి తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.


Share

Related posts

‘వాళ్లకు రాజ్యం ఎక్కడుంది’

somaraju sharma

CM Jagan: లండన్ వెళ్లనున్న సీఎం జగన్ ఫ్యామిలీ.. కారణం ఇదే..

somaraju sharma

Chiranjeevi: 150కి పైగా చిత్రాలు చేసిన చిరంజీవి చేయలేనిది చేస్తున్న చరణ్..!!

sekhar