ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “కేజీఎఫ్-2” సినిమా టీజర్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న టైంలో గురువారం రిలీజ్ అయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రిలీజ్ అవుతుందని సినిమా యూనిట్ తెలియజేయగా గురువారం లీక్ అవడంతో ఊహించనివిధంగా టీజర్ రిలీజ్ అవ్వటంతో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
24 గంటల్లో దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలో పాత సినిమాల వ్యూస్ రికార్డుల అన్నిటినీ కేజీఎఫ్-2 టీజర్ బ్రేక్ చేసేసింది. కేజిఎఫ్ పార్ట్ వన్ లో అదిరా పాత్రను అసలు చూపించలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేవలం సింహపు ఉంగరాన్ని ధరించిన వ్యక్తినే..మొహం కనిపించకుండా చూపించారు. ఈ క్రమంలో కేజీఎఫ్-2 టీజర్ లో అదిరా పాత్రను చేసిన సంజయ్ దత్ ని వెనకాల నుండి మాత్రమే చూపించి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు డైరెక్టర్.
ఈ క్రమంలో తెర మీద తన పాత్ర చూడటం కోసం చాలా ఆతృతగా ఉన్నట్లు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. కెరియర్లో చాలా పాత్రలు చేసినా గాని అదిరా పాత్రను మాత్రం బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అదిరా గా కనిపించడానికి చాలా సేపు కష్టపడాల్సి వచ్చిందని, మేకప్ వేసుకోవడానికి గంటన్నరకు పైగా టైం పట్టిందని సంజయ్ తెలిపాడు. రెండు నిమిషాలు 16 సెకన్ల తో రిలీజ్ అయిన కేజీఎఫ్-2 టీజర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా టీజర్ చివరిలో యాష్ సిగరెట్ వెలిగించటం మొత్తానికి హైలెట్ అని టీజర్ చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.