పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ఆదిపురుష్ పై భారత దేశ వ్యాప్తంగా అధిక స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ హిందూ పౌరాణిక చిత్రం 3D ఎఫెక్ట్స్‌తో వరల్డ్ వైడ్ గా జనవరి 2023న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కాళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ని రాముడు లుక్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు, కానీ మేకర్స్ మాత్రం కామ్ గా ఉన్నారే తప్ప ఎటువంటి లుక్స్, పోస్టర్స్ షేర్ చేయడం లేదు. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో ఆ రోజే ప్రభాస్ లుక్ తో పాటు ఆదీపురుష్ టిసర్ కూడా రిలీజ్ చేయొచ్చని తెలుస్తోంది.
అదిరిపోయే అప్డేట్స్ ఆనాడే
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సెప్టెంబర్ లోనే ఆధిపురుష్ సినిమా గురించి అప్డేట్స్ ఉండొచ్చు అని ఆదిపురుష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ని రాముడిలా చూడటానికి ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? అని ప్రేక్షకులంతా మేకప్స్ పై గురవవుతున్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్, మేకర్స్ ప్రభాస్ పుట్టిన రోజున అప్డేట్స్, ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆపకూడదని అనుకుంటున్నారట.
అప్పుడే రిలీజ్ కానీ
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సినిమాని ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ లాల్ సింగ్ చడ్డా కారణంగా వాయిదా వేసుకున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ కి బాహుబలి లాంటి మంచి హిట్ తెచ్చిపెడుతుంది లేక రీసెంట్ మూవీస్ లాగానే నిరాశపరుస్తుందో చూడాలి.