బాలిక‌ను కాపాడిన సింహాలు.. ఎక్క‌డో తెలుసా ?

పెంపుడు జంతువులు య‌జ‌మానికి ప్ర‌మాదం అని గుర్తిస్తే.. త‌మ ప్రాణాల‌ను ప‌నంగా పెట్టి య‌జ‌మానుల‌ను కాపాడ‌టం చూసే ఉంటారు. కానీ అదే క్రురమృగాలకు ఒక జంతువైనా, మ‌నిషైనా చిక్కితే.. ఏం చేస్తాయి ? బిర్యానీ లెక్క నంజుకు తింటాయి అంటారా..? కానీ మ‌న‌వ మృగాలకు చిక్కిన చిన్నారిని ఆ క్రురమృగాలే కాపాడాయి అంటే న‌మ్ముతారా..? లేదు క‌దా.. కానీ అదే నిజం. దీన్ని బీబీసీ లాంటి ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్స్ ప్ర‌చురించాయి.

ఆ బాలికను మానవ మృగాల నుంచి నిజంగా రక్షించాయంటే.. ఆశ్చర్యకరమే. పైగా ఆ బాలిక‌కు ఎలాంటి హానీ చేయకుండా ఒక రోజంతా ర‌క్షించాయి. పోలీసులు వ‌చ్చే వ‌ర‌కు కంటికి రెప్ప‌లా కాపాడాయి. వారు వ‌చ్చాక వాళ్ల‌కు అప్ప‌గించి అడ‌విలోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ వార్తా సంస్థలు 2005లో ఈ వార్త‌ను ప్రచురించాయి. మ‌ళ్లీ ఈ వార్త ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హ‌ల్ చెల్ చేస్తోంది.

నైరుతి ఇథియోపియాలో నివసించే 12 ఏళ్ల బాలికను గుర్తుతెలియని వారు కిడ్నాప్ చేశారు. వారం రోజుల తర్వాత పోలీసులు ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకున్నారు. దీన్ని గ‌ర్తించిన దుండ‌గులు ఆ అమ్మాయిని బ‌ల‌వంతంగా అడ‌విలోకి తీసుకుపోయారు. బాలిక గ‌ట్టిగా ఏడుస్తూ కేకలు వేసింది. దీంతో ఎక్క‌డినుంచి వ‌చ్చాయో తెలియ‌దు కానీ మూడు సింహాలు ఆ బాలిక ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. వ‌చ్చిన వెంటనే ఆ దుండ‌గుల‌పై దాడి చేసిశాయి. దాంతో వారు ప‌రుగులు తీశారు. ఏడుస్తున్న ఆ బాలిక వద్దే ఆ సింహాలు కూర్చున్నాయి.

బాలిక కోసం గాలిస్తూ పోలీసులు అడవిలోకి వెళ్లారు.అక్క‌డా బాలిక‌ను సింహాల‌తో చూడ‌గానే ఆశ్చ‌ర్య‌పోయారు.ఈ సింహాలు పోలీసులను చూసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఈ విష‌యంపై స్థానిక పోలీస్ ఆఫీస‌ర్ చెప్తూ మేము అక్కడికి చేరే వరకు ఆ సింహాలు ఆ బాలిక‌కు రక్షణ కల్పించాయి అని పేర్కొన్నారు.

ఈ ఘటన ఇప్పటి వ‌ర‌కూ మిస్టరీగానే ఉండిపోయింది. అంతర్జాతీయ మీడియ సంస్థలే ఈ వార్త‌ను స్పెష‌ల్ గా ప్ర‌చురించాయి. అలాగే స్థానిక పోలీసులు దీన్ని నిజ‌మ‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం వ‌చ్చింది. ఈ వార్తకానీ మ‌న ద‌గ్గ‌ర అయితే ఆ బాలిక‌ను అమ్మ‌వారు అంటూ పూజ‌లు చేసేవార‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. దీనిపై జంతు నిపుణులు మాట్లాడుతూ ఆ బాలిక‌ను త‌ర్వాత తిన‌డానికే వ‌దిలేసీ ఉంటాయనీ, తినే స‌మ‌యంలో పోలీసులు వ‌చ్చి ఉంటార‌ని చెబుతున్నారు.