NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ వంట పేరు చెప్పగానే కోమాలో నుంచి లేచిన వ్యక్తి..!

నాన్ వెజ్ లల్లో చికెన్ కు ఉన్న ప్రత్యేకతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ పేరు వినగానే అలా నోట్లో లాలాజలం వచ్చేస్తుంటది కొందరి చికెన్ ప్రియులకి. ఎంత కాదనుకున్నా వారినికోసారైతే ఇంట్లో పక్కాగా చికెన్ వండుకోవాల్సిందేనని పట్టుబడతారు. వేడి వేడిగా చికెన్ తింటుంటే ఉంటందని నా సామిరంగా… ఆ టేస్టే వేరులే అని చికెన్ ప్రియులు కోడి గొప్పతన్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేరేమో.. ఏ ఇంట్లో నైనా వాసన వస్తే చాలు అయ్యబాబోయ్ ఈ రోజు ఎవరో చికెన్ వండుకుంటున్నారని చూడకుండానే చెప్పేస్తుంటారు. అంతలా అలవాటైపోయింది మరి జనాలకు కోడి మాంసం.

కాని ఏమాటకామాటే చెప్పుకోవాలండీ చికెన్ కర్రీ చేసిన ఉపకారం ప్రాణాలను బతికించే డాక్టర్లు కూడా చేయలేకపోయారు. ఏందీ ఏం అర్థమైతలేదు కదా… మరీ సంగతేటంటే బతుకుతాడో బతకడో అని ఒక పేషెంట్ విషయంలో డాక్టర్లు కూడా చేతులు పైకెత్తేసారట.. కాని చికెన్ మే హూనా.. నేను బతికిస్తా.. నా సత్తా చూపిస్తా అంటూ ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తిని మామూలు మనిషిని చేసేసిందంయ్.. ఏంటి నమ్మేలా లేదు కదా.. కాని అదే నిజంగా నిజం.. కావాలంటే ఈ ఆర్టికల్ ను చదివేసి చికెన్ గొప్పతనాన్ని తరించండి.. తైవాన్ కు చెందిన చియూ అనే యువకుడు కొన్ని రోజుల కిందట బైక్ నడుపుతుండగా అనుకోని విధంగా ప్రమాధానికి గురయ్యాడు. ఆ ప్రమాధంలో ఆ యువకునికి ప్రమాధకరమైన గాయాలయ్యాయి.

ఎంతగా అంటే అతడు బతుకుతాడని నమ్మకం కూడా లేనంతా గాయపడ్డాడు. దాంతో అతని తల్లిదండ్రులు హాస్పత్రిలో జాయిన్ చేశారు. అతడు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. అతడు కోమాలోకి వెళ్లి రెండు నెలలు గడిచింది. డాక్టర్లు కూడా మేం ఏమీ చేయలేం.. అతడు బతికే చాన్స్ లేదంటూ చేతులెత్తేసారు. కాని కని పెంచిన ప్రాణం ఊకుంటదా.. ఏదో ఒకమూల నాకొడుకు బతకపోతాడా అని ఆశలు పెట్టుకుని కొడుకుకు ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. అదే సమయంలో కోమాలో ఉన్న వ్యక్తి అన్న చికెన్ తో ప్రత్యక్షమయ్యాడు. నా తమ్ముడికి చికెన్ అంటే ఎంతో ఇష్టం కదా.. దీనితో ఒకసారి ప్రయత్నిస్తానని తమ్ముడి దగ్గరికి చికెన్ తో వెళ్లాడు. రేయ్ తమ్ముడు నీ కోసం ఈ అన్నయ్య చికెన్ తెచ్చాడురా అంటూ ప్రేమతో ఆ తమ్ముడితో మాట్లాడాడు.

ఇంకేముంది చికెన్ మీదున్న మమకారంతో కోమాకే అంకితమైన ఆ యువకుడిలో మెల్లిమెల్లిగా చలనం మొదలైంది. ఇంకేముంది ఒక్కొక్కటిగా శరీర భాగాలు పనిచేయడం మొదలు పెట్టాయి. గబుక్కున చియూ లేచి కూర్చున్నాడంటా.. దాంతో అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంకేముందు చియూ మునపటిలా మారాడు. అతడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యం ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే చియూకి చికెన్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి అన్నయ్య ఈ ప్రయత్నం చేసి చియూని బతికించుకున్నాడు. డాక్టర్ల వళ్ల కాని పని చికెన్ చిటికెలో చేసేసిందని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju