NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

గిన్నిస్ రికార్డుకెక్కిన ఉంగరం..! 12,638 వజ్రాలతో తయారీ…! ఎక్కడో తెలుసా..!

 

బంగారం, ఆభరణాలకు భారతదేశం ఎంతగానో పేరుగాంచింది. విభిన్న రకాల సంప్రదాయకరమైన నగలను తయారు చేయడంలో భారత నగల తయారీదారులు ముందువరుసలో ఉన్నారు. అయితే తాజాగా మీరట్ కు చెందిన సంస్థ అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో వజ్రాలు పొదిగిన ఉంగారిని తయారు చేసారు. అయితే ఈ ఉంగరం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. అది ఏంటి… వజ్రాలు పొదిగిన ఉంగరాలు చాలానే ఉంటాయిగా, కానీ దీనికి మాత్రం గిన్నిస్ బుక్ లో ఎందుకు స్థానం సంపాదించింది అనుకుంటున్నారా… అయితే ఇది చదవండి.

marry gold flower model diamond ring

మీరట్ కు చెందిన నగల తయారీ సంస్థ రేనానీ జ్యూవెలరీ, మొత్తం 12,638 సహజ వజ్రాలను ఒకే ఉంగరంలో పెట్టి తయారు చేసింది. మ్యారీ గోల్డ్ పువ్వు రూపంలో తయారు చేసిన ఈ రింగుకు ‘ద మ్యారీగోల్డ్’ అని పేరు పెట్టారు. ఇన్ని వజ్రాలతో రూపొందించిన కారణంగానే ఈ ఉంగరం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఈ విషయంపై రెనానీ జ్యూవెల్స్ యజమాని హర్షిత్ బన్సాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ కలల ప్రాజెక్టు అని వివరించారు. ఈ ఘనత సాధించడానికి తమకు 2.5 నుంచి 3 ఏళ్ల పట్టిందని హర్షిత్ అన్నారు. మీరట్ లో ఈ ఉంగరాన్ని తయారుచేశామని, ప్రత్యేకంగా 28 మంది క్రాఫ్ట్ మెన్ ను సూరత్ నుంచి తెప్పించి తయారు చేసినట్లు స్పష్టం చేశారు.మీరట్ లాంటి చిన్న నగరానికి చెందిన తమ సంస్థ నగల చరిత్రలోనే అతిపెద్ద గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఈ ఉంగరం బరువు 165.40 గ్రాములు ఉంది. ఇందులో 38.08 క్యారెట్ల నాణ్యత కలిగిన నేచురల్ డైమండ్లను ఉపయోగించామని అయినా చెప్పారు.

guiness world record marry gold diamond ring designer harshit bansal family

ప్రపంచ వ్యాప్తంగా వజ్రాల ఆభరణాల ధ్రువీకరణ కోసం ప్రతిష్టాత్మక ల్యాబరేటరీ అయినా అంతర్జాతీయ గెమోలాజికల్ ల్యాబరేటరీ(ఐజీఐ) ఈ వజ్రపు ఉంగరాన్ని నాణ్యమైనదిగా ధ్రువీకరించింది. ఈ ఉంగరంలోని ప్రతి రెమ్మ ప్రత్యేక ఆకారంలో ఉంటుందని, ఏవీ ఒకదానికొకటి సమానంగా ఉండవు అని సంస్థ యజమాని హర్షిత్ తెలిపారు. ఇది రింగుకు సేంద్రీయ సమరూపత, రూపకల్పన, అమరికకు చెందిన సంపూర్ణ సమ్మేళనాన్ని ఇస్తుందని తెలిపారు. అయితే వజ్రాలు పొదిగిన ఈ ఉంగరం విలువను మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ప్రతీ వజ్రం ప్రత్యేకంగా, సహజరీతిలో పరీక్షించినట్లు తెలిపారు. ఈ వజ్రాలు స్వచ్ఛతను సూచించేందుకు రంగు లేకుండా ఉంటాయని చెప్పారు.

గతంలో హైదరాబాద్ కు చెందిన వజ్రాల వ్యాపారి చందుభాయ్ డైమండ్ స్టోర్ యజామాని శ్రీకాంత్ ,ఈ ఏడాది అక్టోబరులో 7801 వజ్రాలతో బ్రహ్మ వజ్ర కమలం రూపంలో వజ్రపు ఉంగరాన్ని రూపొందించి, గిన్నిస్ బుక్ లో రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డు ను బద్దలు కొట్టాడు ఈ మీరట్ కు చెందిన వజ్రాల షాప్ యజమాని.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?