NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Virus: ఏపీని కమ్మేసిన అత్యంత ప్రమాదకరమైన కరోనా వేరియంట్! లైట్ తీసుకోకండి!ప్రాణాలు పోగొట్టుకోకండి!

Corona Virus: ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది. విశాఖపట్నం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వేరియంట్ విజృంభిస్తోందని అంటున్నారు. కానీ, ఏపీలో ముందుగా ఈ కొత్త వేరియంట్ జాతిని కర్నూలులో మొట్టమొదటగా కనుగొన్నట్టు చెబుతున్నారు. దీన్నీ ఏపీ స్ట్రెయిన్ గా పిలుస్తున్నారు.

The most dangerous corona variant that has devoured the AP!
The most dangerous corona variant that has devoured the AP!

Corona Virus: అత్యంత ప్రమాదకర వేరియంట్ !

మునుపటి కరోనా వైరస్ల కంటే కనీసం 15 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వేరియంట్లలో భారతీయ వేరియంట్ B1.617, B1.618 వేరియంట్ల కంటే ప్రమాదకరంగా ఉండవచ్చునని అంటున్నారు. ఈ ఏపీ స్ట్రెయిన్ ఎంత ప్రాణాంతకమో ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జాతికి సంబంధించి నమూనాలను విశ్లేషణ కోసం CCMBకి పంపారు. విశాఖపట్నంలో ప్రస్తుతం విజృంభిస్తోన్న వేరియంట్ గత సంవత్సరం మొదటి వేవ్‌లో మనం చూసినదానికి చాలా భిన్నంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చుని సీనియర్ వైద్యులు చెబుతున్నారు.

వేగంగా పాకే వేరియంట్ !

కొత్త వేరియంట్లో తక్కువ పొదిగే కాలంతో పాటు వ్యాధి తీవ్రత చాలా వేగంగా ఉందని గమనించినట్టు తెలిపారు. గతంలో వైరస్ బారిన పడిన రోగి హైపోక్సియా లేదా డిస్ప్నియా దశకు చేరుకోవడానికి కనీసం ఒక వారం సమయం పట్టేది. కానీ ఈ స్ట్రెయిన్ సోకిన బాధితుల్లో మూడు లేదా నాలుగు రోజుల్లో తీవ్రమైన పరిస్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. అందుకే ఆక్సిజన్ లేదా ఐసియూ పడకల అవసరం పడుతోందని అంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వీటి కొరత పెరిగిందని అన్నారు. ఈ స్ట్రెయిన్ సోకిన వ్యక్తి నుండి నలుగురు నుంచి ఐదుగురికి పాకడానికి అవకాశం ఉంటుంది.

ఎవరూ ఈ వేరియంట్ కి అతీతులు కారు!

యువ జనాభాతో పాటు ఫిట్నెస్, అధిక రోగనిరోధక శక్తి ఉన్నవారిపై కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందని గుర్తించారు. ఈ వేరియంట్ చాలా తీవ్రమైనదని, అందుకే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరచడం, వీలైనంతవరకూ ఇంట్లో ఉండడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించడమే ఉత్తమ మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju