బిడ్డను కని.. ఫ్రీజర్ లో పెట్టిన తల్లి.. చివరికి?

మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. అలాంటి మాతృత్వానికి కొందరు మాయని మచ్చ తేస్తుంటారు. ఓ మహిళ బిడ్డను కని తన బిడ్డ పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా, ఎంతో క్రూరంగా ప్రవర్తించింది. ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ పుట్టిన కొద్దిసేపటికి తన బిడ్డను ఫ్రీజర్ లో పెట్టిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

రష్యాలోని సైబీరియాలో నవోసిబ్రిస్క్ నగరానికి సమీపంలోగల వీర్క్-తులా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన పాఠశాలలో 14 సంవత్సరాల బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో ఆ బాలిక నెల తప్పడంతో గర్భవతి అయింది. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ నిజాన్ని దాచేసింది.

అయితే నెలలు కావడంతో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తనను ఏం చేస్తారో అన్న భయంతో పుట్టిన బిడ్డను వెంటనే ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఫ్రీజర్ లో దాచింది. అయితే ప్రసవ సమయంలో కలిగే నొప్పులకు ఎంతో బాధపడుతూ కేకలు వేయగా తన తల్లి రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడం వల్ల బాలిక పరిస్థితి విషమంగా మారింది.

ఉన్నట్టుండి తన కూతురు ఏం జరిగిందో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉండగా, ఆస్పత్రిలో అసలు నిజాన్ని ఆ బాలిక బయట పెట్టింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వెళ్లి ఫ్రీజర్ లో ఉన్న బిడ్డను చూడగా అప్పటికే ఆ శిశువు మరణించింది. ఈ ఘటనపై బాధితురాలి పొరిగింటి మహిళ స్పందిస్తూ బాలిక కడుపు పెరుగుతుండడంతో గర్భవతా అని తల్లిని ప్రశ్నించగా… అందుకు ఆమె నా కూతురు లావు పెరుగుతుండడంతో ఇలా తయారయిందని చెప్పుకొచ్చిందనీ సదరు మహిళ తెలియజేశారు. మొదట్లోనే తల్లిదండ్రులకు నిజం చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు..