The Muraka : సముద్రంలో జరిగిన పెళ్లిళ్లు చూశాం. అయితే నీళ్లలో కాసేపు జరిగే పెళ్లి తో పాటు సముద్రంలో కాపురాలు చేయించే కాన్సెప్టులు కూడా రెడీగా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో నిద్రించే ఏర్పాట్లు మాల్దీవులలో చేశారు. ఏదైనా కాస్త వెరైటీగా ఉండాలి భావించేవారికి తృప్తిని ఇచ్చేలా.. “ద మురాకా” అనే హోటల్ ను కోన్రాడ్ దీవిలో నిర్మించారు. కోన్రాడ్ మాల్దీవ్స్ లో ఉండే రంగాలీ ఐలాండ్ లో హోటల్ కమ్ విల్లాను అత్యంత అద్భుతంగా,మనోహరం గా హై టెక్నాలజీ ని వాడి నిర్మించారు.
ఈ హోటల్ లో ఒక్క రాత్రి ఉండాలి అంటే 50 వేల డాలర్లు కట్టాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీ లెక్కల లో 36 లక్షల 24 వేల రూపాయలు అన్నమాట. అయితే కేవలం ఒక్కరాత్రి మాత్రం ఉంటాము అంటే కుదరదట .నీటి అడుగుభాగం ఉండే ఈ లగ్జరీ హోటల్ రెసిడెన్స్ లో కనీసం నాలుగు రాత్రుల ప్యాకేజీ తో ఇది బుక్ చేసుకోవాలి. 4 రాత్రుల కోసం 2 లక్షల డాలర్లు పే చేయవలిసి ఉంటుంది. అంటే ఇంచుమించుగా కోటీ 44 లక్షల 96 వేల రూపాయలు.
మురాకా హోటల్ కమ్ విల్లాను రెండంతస్తుల లో కట్టారు. అడుగున ఉన్న అంతస్తు నీటిలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఇందులో బెడ్ రూమ్, బాత్ రూమ్, డైనింగ్ హాల్ వంటివి ఉంటాయి. పై అంతస్తు మాత్రం నీటి పై భాగంలో ఉంటుంది. పైన సూర్యుణ్ని, ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ సేద తీరడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కట్టిన లివింగ్ రూమ్, హాల్, బెడ్ రూమ్, బాత్ రూమ్, డైనింగ్, కాన్ఫరెన్స్ హాల్ వంటివి ఎంతో అద్భుతంగా కట్టడ నిర్మాణం జరిగింది. ఇందులో 5 స్టార్ రెస్టారెంట్ కూడా అందుబాటులో ఉంది.