న్యూస్ సినిమా

అనుష్క శర్మని అంత మాట అనేసిన నెటిజన్.. ఏంటో తెలిస్తే మీరు కూడా!

Share

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల క్రితం వరకు హిట్ సినిమాల్లో నటించి బాగా అలరించింది. ఇప్పుడు కూడా నటిస్తూ ఎంటర్‌టైన్. అలానే తన సేవా కార్యక్రమాలతో అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ భార్యగా, తన పిల్లలకు తల్లిగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈ ముద్దుగుమ్మ తరచుగా ట్రోలింగ్‌కి గురవుతుంటుంది. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ సరిగా ఆడకపోతే ఈ ముద్దుగుమ్మను చాలామంది తిట్టిపోశారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆమెను ట్రోల్ చేశారు.

అందంగా ఉన్నా ట్రోలింగ్

ఇక తాజాగా ఇంకోసారి అనుష్క శర్మ ట్విట్టర్‌లో ట్రోలింగ్ కి గురయ్యింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆరు బయట బెంచ్ పై కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో అనుష్క చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె పాదాలు సూర్యకిరణాల వెలుగులో మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు బానే ఉంది కానీ కొంతమంది మాత్రం ఈ ఫొటోలోని అనుష్క శర్మని చూసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

అంత మాట అనేశాడు

ఆమె కాళ్లు, చేతులు చూడటానికి ఒకే ఆకారం, సైజులో ఉన్నాయని, సన్నని పత్తి కర్రలా వేలాడుతూ కనిపిస్తున్నాయని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరి కొందరు కూడా ఆమె చేతులు, కాళ్ల గురించి ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ పాత్ర ఏంటి బ్రో అంతమాట అనేసారు, ఇదేం బాగోలేదు అని కామెంట్ పెడుతున్నారు. అనుష్క అంత అందంగా కనిపిస్తున్నా కూడా కొంతమంది ఏదో ఒక రకంగా వంకలు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారని అనుష్క ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అనుష్క ఇప్పుడు ‘చెక్ దే ఎక్స్ప్రెస్’ సినిమాలో నటిస్తోంది. వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే తొందరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Share

Related posts

గంటా కి దెబ్బ మీద దెబ్బ..??

sekhar

బాలీవుడ్‌కి మరో తమిళ చిత్రం

Siva Prasad

Tirupati By Poll: బీజేపీ కండువా కప్పుకున్న ప్రముఖ హాస్య నటి హేమ

somaraju sharma