ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త నినాదం..!!

AP Politics: Cyber Crimes Game
Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం గుళ్ళూ, గోపురాలు అందులో ఉన్న విగ్రహాలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క విగ్రహాలు ధ్వంసం అవ్వడం మరోపక్క అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తో కుల ప్రాతిపదికన నడిచే ఏపీ రాజకీయాలు మత ప్రాతిపదిక వైపు అడుగులేస్తున్న క్రమంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

PDF may save the grace of AP politicsఇప్పటికే ప్రతిపక్షాలు విగ్రహాల ధ్వంసం ఘటన ఆధారం చేసుకుని అధికార పార్టీ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరోపక్క అధికారంలో ఉన్న జగన్ ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్ పరిపాలన పరంగా ఇవ్వని క్రమంలో మొదటిలో అమరావతి నినాదాన్ని ఎదుర్కొన్న ప్రతిపక్షాలు ఇప్పుడు మతం ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నట్లు వైసీపీ మద్దతు దారులు పేర్కొంటున్నారు.

 

ఇదిలా ఉంటే గ్రేటర్ రాయలసీమ అంటూ సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా కలుపుకుని గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ రాయలసీమ కోసం త్వరలో ఉద్యమానికి కూడా రెడీ అన్నట్టు.. ఇందుకోసం రాయలసీమలో ఉన్న నాయకులతో భేటీ కాబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాయలసీమలో జగన్ పార్టీ బలంగా ఉండటంతో.. ప్రతిపక్షాలు గంగుల ప్రతాపరెడ్డి తో సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు వైసీపీ శ్రేణులు గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని తప్పు పడుతున్నాయి. ఏది ఏమైనా ఒకపక్క అమరావతి మరోపక్క గ్రేటర్ రాయలసీమ అంటూ సరికొత్త నినాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి.


Share

Related posts

rahasya gorak trendy pictures

Gallery Desk

Lock Down:: రేపటి నుండి ఆ రాష్ట్రంలోనూ లాక్ డౌన్..!!

somaraju sharma

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో జోరు మీద ఉన్న కేటీఆర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar