బిగ్ బాస్ షో సీజన్ 4 – Bigg Boss season 4 రన్నర్ అప్ గా నిలిచినా అఖిల్ – Akhil కి హౌస్ నుంచి బయటకి వచ్చాక క్రేజ్ ఎంతగా పెరిగిందో మనందరికీ తెలిసిందే. ఆ షో ద్వారా అఖిల్ తెలుగు ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అయిపోయాడు. ఈ షో ముందు వరకు కేవలం కొందరికి మాత్రమే అఖిల్ తెలుసు. బిగ్ బాస్ షో తో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికి దగ్గరైపోయాడు. బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ మోనాల్ గజ్జర్ – Monal Gajjar తో లవ్ స్టోరీ నడపడం తో మరింత పాపులర్ అయిపోయాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అఖిల్ మరియు మోనాల్ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అఖిల్ సార్థక్ ఇటీవలే తన లవ్-బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా లవ్ బ్రేకప్ – break up అయింది మోనాల్ గజ్జర్ తో కాదు కానీ ఇది తన పాత లవ్ స్టోరీ.
తన లవర్ కు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువని ఆ కారణం తోనే తనను వదిలేసిందని చెప్పాడు. అంతేకాకుండా ఈసారి మాత్రం బాగా టైం తీసుకునే క్యాస్ట్- caste ఫీలింగ్ లేని అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నాడు అఖిల్. తన చిన్న వయసులోనే హృదయం విరిగిపోయిందని, తను ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను అంటున్నాడు అఖిల్.
అప్పటిలో నన్ను ప్రేమించిన అమ్మాయి క్యాస్ట్ ఫీలింగ్ తో చివరికి నన్ను వదిలేసింది అంతేకాకుండా ఇప్పటికి మన సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ చాలా మందిలో ఉంది కానీ నాకైతే అలాంటి ఫీలింగ్ ఏమి లేదు అంటూ చెప్పుకొచ్చాడు. నా ఫస్ట్ లవ్ కాస్ట్ కారణంగా బ్రేకప్ అయ్యింది కాబట్టి ఇక పై నేను ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళకి ముందుగానే క్యాస్ట్ చెప్పి తర్వాతే లవ్ చేస్తా అంటున్నాడు అఖిల్.