NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ష్‌… అన్నీ పార్టీల్లోనూ ఇప్పుడు ఇదొక్క‌టే టెన్ష‌న్‌…!

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే. తాజాగాదీనికి బీజేపీ త‌గిలింది.  ఈ క్ర‌మంలో ఇరు పార్టీల్లోనూ క‌ల‌వ‌ర ప‌రుస్తున్న ఏకైక విష‌యం.. క్షేత్ర‌స్థాయిలో ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీని ముందుకు న‌డిపించిన నాయ‌కులు.. టికెట్లు కోరుతుండ‌డం. పోనీ.. ఇవ్వాల‌ని ఉన్నా ఆ మేర‌కు పార్టీల‌కు టికెట్లు ద‌క్కే ఛాన్స్ లేక‌పోవ‌డం. బీజేపీ మ‌రో 10 అసెంబ్లీ, 6 పార్ల‌మెంటు స్థానాల‌ను త‌న్నుకు పోయింది. దీంతో రెండు పార్టీలు కూడా.. కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ఇద్ద‌రూ కూడా కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌ద‌వులు ఇస్తామ‌ని చెబుతున్నా రు.

అంతేకాదు.. టికెట్లు రాలేద‌ని.. గుస్సాగా ఉండొద్ద‌ని, వ్య‌తిరేక ప్ర‌చారం చేయొద్ద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇక‌, నారా లోకేష్ మ‌రో అడుగు ముందుకు వేసి.. తాను అంతా గ‌మ‌నిస్తున్నాన‌న్నారు. పార్టీలో ఎవ‌రు క‌ష్ట‌ప‌డుతున్నారో త‌న‌కు తెలుసున‌ని.. ఆ మేర‌కు వారికి న్యాయం జ‌రుగుతుంద‌ని కూడా చెప్పారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జగించే ప‌నిని ప్రారంభించారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలోనే ఉన్న‌ ప‌వ‌న్‌.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. `టికెట్ల కోసం.. చాలా మంది మీలో ఎదురు చూస్తున్నారు. ఆ విష‌యం నాకు తెలుసు. కానీ.. కొన్ని కొన్ని సంద‌ర్భాలు సంక్లిష్టంగా ఉంటాయి. మీరు అర్ధం చేసుకోవాలి` అని వ్యాఖ్యానించారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, టికెట్లు కూడా వారికిఇచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే టిక్కెట్ల కన్నా.. భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని చెప్పారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు టీడీపీలో రెండు సార్లు కీలక పదవి వచ్చేలా చేశానని.. అలాంటిది పార్టీ కోసం కష్టపడే వారిని వదిలేయబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ సూచించారు. ప‌ని చేసిన వారి పేర్లు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌డుపులో పెట్టుకుని కాపాడుకుంటామ‌ని.. అన్నారు. `క్షేత్ర‌స్థాయిలో మీరు కూడా ప‌ద‌వులు కోరుకుంటారు. ఇది త‌ప్పేంకాదు. కానీ, రాష్ట్రంలో కొన్ని రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. అందుకే మ‌నం రెండు పార్టీల‌తో క‌లిసి ముందుకు వెళ్తున్నాం. ప్ర‌స్తుతానికి ప‌ద‌వుల‌పై కాకుండా.. పార్టీని అధికారంలోకి  తీసుకువ‌చ్చేలా వైసీపీని గ‌ద్దె దింపేలా ప‌నిచేయాలి. త‌ర్వాత‌.. ప‌ద‌వులు వాతంట‌త అవే వ‌స్తాయి. మీరు ఆ విషయాన్ని నాకు వ‌దిలేయండి` అని వ్యాఖ్యానించారు. కాగా, గురువారం మ‌రికొంత మందితో ప‌వ‌న్ జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju