NewsOrbit
న్యూస్

పీకే టీం మళ్లీ వస్తోందంటే వైసీపీలో ఆనందం లేదు ! ఎందుకంటే ఇందుకు !!

మరోసారి ప్రశాంతి కిషోర్ టీం ఆంధ్రప్రదేశ్ కి రానుందన్న వార్తలు వైసీపీలోనే కలకలం రేపుతున్నాయి.ఇంతకు ముందు పీకే టీ౦ ఎన్నికల వరకు వైసిపికి సహకరించింది కాబట్టి పెద్ద ఇబ్బంది తలెత్తలేదు.

 

కానీ ఈసారి ప్రభుత్వ పథకాల అమలు ప్రత్యేకించి వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రశాంతి కిషోర్ టీం వేలు పెట్టబోతున్న దన్న వార్త పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.వారి భయానికి కారణాలు లేకపోలేదు

గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నరోజుల్లో… జన్మభూమి కమిటీలను జనాలపైకి వదిలారు. పూర్తిగా ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిలా వారు ఉండాలని బాబు తలచినా కాని అది కాస్త మరోరూపం దాల్చింది! ఫలితంగా బాబు ఘోర పరాజయంలో ఇవి కూడా కీలకభూమిక పోషించాయని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదే రకమైన ఆలోచన జగన్ చెయబోతున్నారని కథనాలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే పీకే టీం మళ్లీ రాష్ట్రంలోకి వస్తోందని సమాచారం

అదే నిజమైతే మాత్రం జగన్ కొంపముంచేవి అవే అని వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఆయనే తప్పుదోవపట్టించబోతున్నారని అంటున్నారు! వాలంటీర్లు అంటే జగన్ ప్రైవేటు సైన్యం కాదనేది గట్టిగా వినిపిస్తున్న మాట! ప్రజల సొమ్మును వారికి జీతాలుగా ఇస్తున్న తరుణంలో… వారితో పార్టీ కార్యక్రమాలు చేయించడం తగదనేది కొత్తవాదన! పికె టీం ద్వారా వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు బాగా ఉపయోగించుకోవాలన్నది జగన్ ఆలోచనగా కనపడుతుంది అంటున్నారు


దీంతో ప్రశాంతంగా సాగిపోతున్న వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.ఇక వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? వీరిపై పెత్తనం చేయించడానికన్నట్లుగా రాబోతున్నది అని చెబుతున్న పీకే టీం ని ప్రసన్నం చేసుకోవడానికే… అధికారులు, వాలంటీర్లు పనిచేసే ప్రమాధం ఉందంటున్నారు. ఈ క్రమంలో వ్యవస్థ గాడితప్పి, జగన్ ప్రభుత్వంపై చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాధం ఉందని అంటున్నారు.

వాలంటీర్లను వాలంటీర్లుగా ఉంచి ఎన్ని పనులు చేయించుకున్నా అది జగన్ కు చాలా ప్లస్ అని… అలా కాకుండా వారు పీకే ఆధ్వర్యంలో అనధికారిక వైకాపా కార్యకర్తలుగా మారితే మాత్రం… అది మరో జన్మభూమి కమిటీలుగా మారే ప్రమాధం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జన్మభూమి కమిటీల వల్ల చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని జగన్ ప్రభుత్వం అంచనా వేసి ఆ తరహా విధానాలను పాటించకపోవటమే శ్రేయస్కరమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.జగమొండి గా పేరు తెచ్చుకున్న జగన్ వింటారా అన్నదే చూడాలి!

author avatar
Yandamuri

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!