Taliban: అమెరికా ప్రెసిడెంట్ ఏంటి తాలిబన్లని అంత మాట అనేశాడు !!

Share

Taliban: ఆప్ఘనిస్తాన్ దేశంలో జరిగిన అల్లకల్లోలం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అశ్రఫ్ గనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు గద్దెనెక్కారు. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలు భయపడిపోతున్నారు. చాలా మంది అక్కడి నుంచి వేరే దేశాలకు పారిపోయారు. ఇందులో ప్రముఖులూ ఉన్నారు. కాగా, అమెరికా వల్లే ఇలా తాలిబన్లు అప్ఘన్‌లో అరాచకాలు చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఇకపోతే ఆప్ఘన్ నుంచి సైనిక వ్యవస్థను తాలిబన్లు విత్ డ్రా చేసుకున్నారు. కాగా, ఇటీవల తాలిబన్లకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ఘనిస్తాన్ నుంచి ఆగస్టు 31లోగా అమెరికా సైనిక బలగాలు వెళ్లిపోవాలని తాలిబాన్లు గడువు విధించారు.

BREAKING : నేడే ఈ-శ్రామ్ పోర్టల్ లాంచ్..!
ఈ నేపథ్యంలోనే అమెరికా పశ్చిమ దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఇరుక్కు పోయారని, వారిని తరలించడం చాలా కష్టమైన పని అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపాడు. ఈ క్రమంలోనే జో బైడెన్ తమకు తాలిబన్లు సహకరిస్తున్నారని చేసిన వ్యాఖ్య పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బైడెన్ అంతటితో ఆగకుండా తాలిబాన్లు చేసే పనుల ద్వారానే వారిని ఇంటర్నేషనల్ సొసైటీ గుర్తిస్తుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తాలిబాన్లు జనాల తరలింపు గడువును పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా అగ్రరాజ్య అధ్యక్షుడి వైఖరి, వ్యాఖ్యలతో ఇంకా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే ఆప్ఘనిస్తాన్ దేశం నుంచి ప్రముఖులు చాలా మంది ఇప్పటికే వేరే దేశాలకు చేరిపోయారు.

vijay devarakonda : అర్జున్ రెడ్డి సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతోన్న వాళ్లకి 4 ఏళ్ళ తరవాత షాకింగ్ సమాధానం చెప్పిన విజయ్ దేవరకొండ

ఆ దేశ తొలి మహిళా, ముస్లిమేతర ఎంపీ భారత్‌కు వచ్చి దేశ రాజధాని ఢిల్లీలో తలదాచుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన మాతృభూమి నుంచి పిడికెడు మట్టిని కూడా తెచ్చుకోలేకపోయానని భావోద్వేగానికి గురి అయింది. మొత్తంగా మనం అనుకున్న దాని కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే భయానక, అరాచక పరిస్థితులు ఆప్ఘనిస్తాన్‌లో నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆ దేశంలో మహిళల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ తమ భద్రతా దళాలకు మహిళలతో ఎలా వ్యవహరించాలో తెలియదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే మహిళలు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. సరైన పద్ధతులు అమలు అయ్యేంత వరకు మహిళలు బయటకు రావద్దని సూచించారు. ఈ విషయాలను బట్టి ఆప్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.


Share

Related posts

Job update: ఎన్ పీసీఐఎల్ నోటిఫికేషన్..!!

bharani jella

Samantha: యడ్స్ ఓపెనింగ్ లకి వచ్చే డబ్బు సమంత ఏం చేస్తుందో తెలుసా..??

sekhar

Sonu sood: పోటీ కి రెడీ అవుతున్న సోనూసూద్… ఇక వార్ వన్ సైడ్.. అంటున్న నెటిజన్లు..??

sekhar