బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పారితోషికం ఎంత ఉంటుందో కూడా మనం ఊహించలేము. హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ హైయెస్ట్ పైడ్ యాక్ట్రెస్ గా నిరంతరం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇంతకుముందు ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించేందుకు 20 కోట్ల పారితోషికం డిమాండ్ చెయ్యగా ఆ డీల్ 18 కోట్లకు క్లోజ్ అయ్యినట్లు ప్రచారం సాగింది.
దీపికా పదుకొనే విలాసాల గురించి తెలిస్తే ఆశ్చర్యంతో కళ్లు భైర్లు కమ్ముకుంటాయి. తను ఉపయోగించే మేకప్ కిట్ ఖరీదు సహా కాస్ట్యూమ్స్ వగైరా వాటి కోసమే ఏకంగా లక్షల్లో ఖర్చుపెడుతుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన భర్త రణవీర్ తో కలిసి నూతన సంవత్సర సెలబ్రేషన్ లో భాగంగా రణతంబోర్ (రాజస్థాన్) కు వెళ్ళింది.
అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం భర్త రణవీర్ తో కలిసి షికార్ చేస్తున్న దీపిక చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ ను గుర్తించిన నెటిజన్లు దానిపై రీసెర్చ్ చేశారు. దాని ఫలితాలు షాక్ కి గురి చేసాయి. ఇది ప్రఖ్యాత `బొట్టెగా వెనెటా బ్యాగ్` మరియు దీని ధర ఏకంగా మారుతి ఆల్టో కారు ధరకు సమానం అని తెలిసింది.
ఆ హ్యాండుబాగ్ వెళ ఒక సామాన్యుడు ఆల్టో కార్ కొనుక్కుని కుటుంబ సమేతంగా షికార్ చేసేంత ఖరీదు అంటే నమ్ముతారా? అవును, బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ బ్యాగ్ బ్రాండ్ అధికారిక వెబ్సైట్లో ఖరీదు ఏకంగా $4350 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ రూ 321900 అన్నమాట. అంత చిన్న బ్యాగ్ ఖరీదు అంత? అంటూ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. ఇక దీపిక లుక్ & ఫ్యాషన్ విషయానికి వస్తే, బాలీవుడ్ లో చాలా కొద్దిమంది మాత్రమే ఆమెతో సరిపోలవచ్చు.