నయనతార ఏదో ఒక వార్త మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. నయనతార మొదట కాలేజీ చదువుతున్న రోజుల్లో మోడలింగ్ చేసేటప్పుడు,అనుకోకుండా ఆమెను చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారట. ఈమెకు సినిమాల్లో నటించాలని ఆసక్తి ఏమాత్రం లేదు కానీ అంత పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇచ్చేదప్పటికీ ఆమె ఒప్పుకుంది. ఒక్క సినిమాతో సినీ జీవితం ముగిద్దాం అనుకుని వచ్చిన నాయనతార కి వరుసగా ఆఫర్లు రావడంతో సినీరంగంలోకి వచ్చి ప్రస్తుతం సౌత్ లేడీ సూపర్ స్టార్ గా అగ్రస్థానంలో నిలిచింది.
నయనతారకి పెళ్లి విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఆటంకం కలుగుతూనే వుంది. అంతేకాకుండా మొదటినుంచి ఏదో ఒక కారణం చేత ఎప్పటికప్పుడు ఈమె తన ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతూనే వచ్చింది.
నయనతార ప్రస్తుతం తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తున్న విషయం మనకి విదితమే. మొదట్లో ఆమె శింభుతో ప్రేమ వ్యవహారం నడిపించించారని, ఏవో కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత మరోసారి ఆమె ప్రభుదేవాతో ప్రేమలో పడ్డట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కానీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఇప్పటికి స్పష్టంగా తెలియదు.
అయితే, ఇప్పుడు ప్రభుదేవాతో తాను ఎందుకు విడిపోయిందో కూడా నయనతార కారణం చెబుతోంది. వీరు విడిపోవడానికి దానికి ప్రధాన కారణం ప్రభుదేవా మొదటి భార్య. క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవా ఆదేశం మేరకు అప్పటిలో హిందువుగా కూడా మారిందట. ఆ తరువాత ప్రభుదేవా చాలా కండీషన్స్ పెట్టడంతో పాటు తన పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించడంతో విసిగిపోయి నయనతార అతనికి దూరమైనట్లు చెప్పింది.