Sekhar Master: ఉన్నట్టుండి “ఢీ” నుండి శేఖర్ మాస్టర్ బయటికి రావటనికి కారణం అదేనట..??

Share

Sekhar Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకరు శేఖర్ మాస్టర్. ఇండస్ట్రీలో డాన్స్ పరంగా అదరగొట్టే హీరోలకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆల్ టైం ఫేవరేట్. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోలకు మర్చిపోలేని కొరియోగ్రాఫర్ సాంగ్స్ అందివ్వటం.. టాప్ బ్రేక్ స్టెప్ లు వేయించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి కూడా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పని చేశారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన చాలా సాంగ్స్ స్టెప్పులు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నయి.

Shekhar Master is dead .. Google made a big mistake !! Shakavutunna Fans - Hayat News

ముఖ్యంగా గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన  “అలా వైకుంఠపురం లో” సినిమాలో “బుట్ట బొమ్మ సాంగ్” స్టెప్ తెగ వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్లు అదేరీతిలో మరికొంతమంది నటినటులు.. సేమ్ అదే స్టెప్ వేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఇంతగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. “ఢీ” అనే షో లో జడ్జి గా రాణించిన శేఖర్ మాస్టర్.. చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. శేఖర్ మాస్టర్ అంటే ముందుగా కొరియోగ్రాఫర్ కన్నా “ఢీ” షో గుర్తొచ్చేలా అంత క్రేజ్ బయట ఏర్పడింది. అయితే ఉన్నట్టుండి “ఢీ” షో నుండి శేఖర్ మాస్టర్..నీ ఇటీవల షో నిర్వాహకులు అనగా మల్లె మాల మీడియా తప్పించారు.

శేఖర్ మాస్టర్‌కు కరోనా.. గత నెలలో పాజిటివ్ అని తేలిందట.. వీడియో వైరల్ | Sekhar Master Tests Corona Positive And Donate Plasma - Telugu Filmibeat

అప్పట్లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన శేఖర్ మాస్టర్…”ఢీ” ద్వారా.. మంచి గుర్తింపు పొందటం జరిగింది. తనకు ఈ షో ఎంతగానో గుర్తింపు ఇవ్వటంతో జడ్జిగా రాణిస్తూ ప్రొడక్షన్ హౌస్ నుండి భారీగా పారితోషికం కూడా అందుకుంటున్నారు. అటువంటిది శేఖర్ మాస్టర్ ని షో నుండి తప్పించడానికి గల కారణం ఏంటా అని నెటిజన్లు..షో వీక్షకులు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వస్తున్న వార్తల ప్రకారం మల్లెమాల రూల్స్ ప్రకారం.. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న షోలో… రాణిస్తున్న టైంలో మరో షో లో.. చేయకూడదు. అయితే శేఖర్ మాస్టర్ ఇటీవల మల్లెమాల  రూల్స్ బ్రేక్ చేసి మరో ఛానల్లో మాటీవీలో కామెడీ స్టార్ ప్రోగ్రాం కు జడ్జిగా చేస్తూ ఉండటం తో ఢీ షో నుండి.. మల్లెమాల వారు శేఖర్ మాస్టర్ ని తప్పించినట్లు లేటెస్ట్ టాక్.

 

కానీ పర్మినెంట్ గా కాకుండా మాటీవీలో మానేసిన రోజే.. మళ్లీ శేఖర్ మాస్టర్ “ఢీ” లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అది ఏమీ కాదు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో శేఖర్ మాస్టర్ సెలెక్ట్ అయ్యారని అందువల్లే..”ఢీ” లో కనిపించడం లేదని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా శేఖర్ మాస్టర్ “ఢీ” లో లేకపోవటం అనేది బుల్లితెర అభిమానులకు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా.. నెంబర్ వన్ పొజిషన్ లో రాణిస్తున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కూడా అదేరీతిలో కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలకు టాప్ సాంగులకు.. మర్చిపోలేని స్టెప్పులు అందించిన శేఖర్ మాస్టర్ కెరియర్లో కీలక ఘట్టమైన “ఢీ” లో ఆయన లేకపోవటం ఇండస్ట్రీ పరంగా కూడా సంచలనంగా మారింది.


Share

Related posts

Breaking: ఈనెల 21 లేదా 22 న అసెంబ్లీ సమావేశాలు..!!

P Sekhar

Anil ravipudi : అనిల్ రావి పూడి ఇచ్చిన షాకింగ్ న్యూస్ తో ఎఫ్ 3 ఫ్యాన్స్ హర్ట్ అవుతారా ..?

GRK

టీటీడీ కార్తీక మాస మహావ్రత దీక్ష !

Sree matha